
హైదరాబాద్, వెలుగు : కామన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎంట్రెన్స్ టెస్ట్(సీపీగెట్)–2023 ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. పీజీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం మొత్తం 30,176 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా, 22,566 మందికి సీట్లు అలాట్ చేసినట్టు సీపీగెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగా రెడ్డి తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు అక్టోబర్ 4లోపు ఆన్లైన్లో ఫీజు చెల్లించి, కాలేజీల్లో చేరాలని సూచించారు.
దోస్త్ స్పెషల్ ఫేజ్లో 6,843 మందికి సీట్లు
డిగ్రీలో ప్రవేశాలకు నిర్వహించిన దోస్త్ స్పెషల్ ఫేజ్ సీట్ల అలాట్మెంట్ ప్రక్రియ శుక్ర వారం ముగిసిందని హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. వెకెన్సీ సీట్ల డ్రైవ్ ద్వారా డిగ్రీలో సీట్ల కోసం 7,040 మంది వెబ్ ఆప్షన్లు ఇవ్వగా, దాంట్లో 6,843 మందికి సీట్లు కేటాయించినట్టు చెప్పారు. తక్కువ ఆప్షన్లు ఇచ్చిన మరో 197 మందికి సీట్లు అలాట్ కాలేదన్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల30లోగా(ఆదివారం) ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టు చేయాలని చైర్మన్ సూచించారు.