హైదరాబాద్: తెలంగాణ సీనియర్ చెస్ అధికారి కేఎస్ ప్రసాద్‌ను 2025 కామన్వెల్త్ చెస్ చాంపియన్‌షిప్‌కు హెచ్‌వోడీగా నియమించారు. నేటి నుంచి 17 వరకు కౌలాలంపూర్‌లో ఈ టోర్నీ జరగనుంది. ఇందులో పాల్గొనే ఇండియా బృందానికి ప్రసాద్ ప్రతినిధిగా వ్యవహరిస్తారు. వివిధ ఏజ్ గ్రూప్‌ల్లో మొత్తం 55 మంది ప్లేయర్లు బరిలోకి దిగుతున్నారు. తెలంగాణ నుంచి అండర్–19 నేషనల్ చాంపియన్ ఆదిరెడ్డి అర్జున్, అండర్–17 నేషనల్ చాంపియన్ శ్రీరామ్ ఆదర్శ్ ఇందులో పాల్గొంటున్నారు.
