టీటీ, లాన్ బౌల్స్ లో ఇండియాకు స్వర్ణాలు

టీటీ, లాన్ బౌల్స్ లో ఇండియాకు స్వర్ణాలు

కామన్వెల్త్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా పతకాల వేట దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఎప్పుడూ మెడల్స్‌‌‌‌‌‌‌‌ వచ్చే క్రీడాంశాలతో పాటు ఈసారి సరికొత్త ఆటలోనూ తన సత్తా ఏంటో చూపెట్టింది. మంగళవారం జరిగిన పోటీల్లో టేబుల్‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌లో స్వర్ణాన్ని నిలబెట్టుకోగా, లాన్‌‌‌‌‌‌‌‌ బౌల్స్‌‌‌‌‌‌‌‌లో తొలిసారి గోల్డ్‌‌‌‌‌‌‌‌ నెగ్గి కొత్త చరిత్ర సృష్టించింది. వెయిట్‌‌‌‌‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌‌‌‌‌లో వికాస్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ సిల్వర్‌‌‌‌‌‌‌‌ కాంతులతో ఆనందాన్ని రెట్టింపు చేశాడు. వెయిట్‌‌‌‌‌‌‌‌లిఫ్టింగ్‌‌‌‌‌‌‌‌ను పక్కనబెడితే ఇతర క్రీడాంశాల్లో ఇండియాకు రెండు గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్స్‌‌‌‌‌‌‌‌ వచ్చాయి.

బర్మింగ్‌‌‌‌‌‌‌‌హామ్‌‌‌‌‌‌‌‌: అంతగా పరిచయం లేని లాన్​ బౌల్స్​లో ఇండియా విమెన్స్ టీమ్​ అద్భుత ఆటతో  గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ సాధించి చరిత్ర సృష్టించింది. మంగళవారం జరిగిన విమెన్స్​ ఫోర్స్​ ఫైనల్లో లవ్లీ చౌబే (లీడ్‌‌‌‌‌‌‌‌), పింకి (సెకండ్‌‌‌‌‌‌‌‌), నయన్‌‌‌‌‌‌‌‌మోని సైకియా (థర్డ్‌‌‌‌‌‌‌‌), రూపా రాణి టిర్కే (స్కిప్‌‌‌‌‌‌‌‌)తో కూడిన ఇండియా బృందం 17–10తో సౌతాఫ్రికాపై గెలిచింది. స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌ నుంచే సూపర్‌‌‌‌‌‌‌‌ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌ చేసిన ఇండియా  ఓ దశలో 8–2తో లీడ్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది. కానీ తాబెలో మువాంగో (లీడ్‌‌‌‌‌‌‌‌), బ్రిడ్జెట్‌‌‌‌‌‌‌‌ కాలిట్జ్‌‌‌‌‌‌‌‌ (సెకండ్‌‌‌‌‌‌‌‌), ఎస్మీ క్రుగెర్‌‌‌‌‌‌‌‌ (థర్డ్‌‌‌‌‌‌‌‌), జొనాన్‌‌‌‌‌‌‌‌ స్నైమన్‌‌‌‌‌‌‌‌ (స్కిప్‌‌‌‌‌‌‌‌) కూడిన సఫారీ టీమ్‌‌‌‌‌‌‌‌ అద్భుతంగా పుంజకుని 8–8 స్కోరును సమం చేసింది. అయితే చివరి మూడు రౌండ్లలో గెలుపే లక్ష్యంగా పోరాడిన ఇండియన్‌‌‌‌‌‌‌‌ టీమ్‌‌‌‌‌‌‌‌.. చకచకా పాయింట్లు సాధించి టాప్‌‌‌‌‌‌‌‌ ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచింది.  

మెన్స్​ టీటీ జట్టు ‘తీన్’​మార్​

మెన్స్‌‌‌‌‌‌‌‌ టేబుల్‌‌‌‌‌‌‌‌ టెన్నిస్‌‌‌‌‌‌‌‌ ఫైనల్లో ఇండియా 3–1తో సింగపూర్‌‌‌‌‌‌‌‌పై గెలిచింది. ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగిన ఇండియాకు డబుల్స్‌‌‌‌‌‌‌‌లో హర్మీత్‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌–సత్యన్​  జోడీ 13–11, 11–7, 11–5తో యంగ్‌‌‌‌‌‌‌‌ ఇజాక్‌‌‌‌‌‌‌‌ క్వెక్‌‌‌‌‌‌‌‌–యు కొన్‌‌‌‌‌‌‌‌ పెంగ్‌‌‌‌‌‌‌‌పై గెలిచి శుభారంభం ఇచ్చింది. కానీ తొలి సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో శరత్‌‌‌‌‌‌‌‌ కమల్‌‌‌‌‌‌‌‌ 7–11, 14–12, 3–11, 9–11తో జా యు క్లారెన్స్‌‌‌‌‌‌‌‌ చువ్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఓడాడు. దీంతో స్కోరు 1–1తో సమమైంది. రెండో సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో సత్యన్​ 12–10, 7–11, 11–7, 11–4తో యు కొన్‌‌‌‌‌‌‌‌ పెంగ్‌‌‌‌‌‌‌‌పై గెలవడంతో ఇండియా 2–1 లీడ్‌‌‌‌‌‌‌‌లోకి వెళ్లింది. కీలకమైన మూడో సింగిల్స్‌‌‌‌‌‌‌‌లో హర్మీత్‌‌‌‌‌‌‌‌ దేశాయ్‌‌‌‌‌‌‌‌ 11–8, 11–-5, 11–-6తో జా యు క్లారెన్స్‌‌‌‌‌‌‌‌ చువ్‌‌‌‌‌‌‌‌ను ఓడించి ఇండియాకు స్వర్ణాన్ని ఖాయం చేశాడు. 2006 మెల్‌‌‌‌‌‌‌‌బోర్న్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియా తొలిసారి టీమ్‌‌‌‌‌‌‌‌ గోల్డ్‌‌‌‌‌‌‌‌ను గెలిచింది. తర్వాత 2018 గోల్డ్‌‌‌‌‌‌‌‌ కోస్ట్‌‌‌‌‌‌‌‌లో రిపీట్‌‌‌‌‌‌‌‌ చేసింది. 2002 మాంచెస్టర్‌‌‌‌‌‌‌‌ గేమ్స్‌‌‌‌‌‌‌‌ నుంచి ఈ స్పోర్ట్‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు ఇది ఏడో గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ కావడం విశేషం. ఓవరాల్‌‌‌‌‌‌‌‌గా గేమ్స్‌‌‌‌‌‌‌‌ హిస్టరీలో శరత్‌‌‌‌‌‌‌‌ కమల్​కు ఇది పదో మెడల్‌‌‌‌‌‌‌‌ కావడం విశేషం. 

విమెన్స్‌‌‌‌ హాకీ జట్టు ఓటమి

వరుసగా రెండు మ్యాచ్‌‌‌‌ల్లో గెలిచిన ఇండియా విమెన్స్‌‌‌‌ హాకీ టీమ్‌‌‌‌కు  తొలి ఓటమి ఎదరైంది. పూల్‌‌‌‌–ఎ పోరులో ఇండియా 1–3తేడాతో ఇంగ్లండ్​ చేతిలో పరాజయం పాలైంది.  

ఫైనల్లో శ్రీశంకర్‌‌‌‌.. ద్యుతీకి నిరాశ​

మెన్స్‌‌‌‌ లాంగ్‌‌‌‌జంప్‌‌‌‌లో మురళీ శ్రీశంకర్‌‌‌‌, అనీస్‌‌‌‌ యాహియా ఫైనల్‌‌‌‌ చేరుకున్నారు. క్వాలిఫికేషన్‌‌‌‌ గ్రూప్‌‌‌‌–ఎలో   శ్రీశంకర్‌‌‌‌ 8.05 మీటర్ల దూరం జంప్‌‌‌‌ చేసి టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ సాధించాడు.  యాహియా 7.68 మీటర్లు జంప్‌‌‌‌ చేసి గ్రూప్‌‌‌‌-–బిలో మూడో స్థానంలో నిలిచాడు. విమెన్స్‌‌‌‌ షాట్‌‌‌‌పుట్‌‌‌‌లో మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌ కౌర్ ఫైనల్‌‌‌‌కు క్వాలిఫై అయ్యింది. క్వాలిఫికేషన్‌‌‌‌ రౌండ్‌‌‌‌లో ఆమె గుండును 16.84 మీ దూరం విసిరి ఓవరాల్‌‌‌‌గా ఏడో స్థానం సాధించింది. కానీ, విమెన్స్‌‌‌‌ 100 మీ. ఈవెంట్‌‌‌‌లో స్టార్‌‌‌‌ స్ప్రింటర్‌‌‌‌ ద్యుతీ చంద్‌‌‌‌ నిరాశ పరిచింది. ఐదో నంబర్‌‌‌‌ హీట్స్‌‌‌‌లో 11.55 సెకండ్ల టైమింగ్‌‌‌‌తో ఓవరాల్‌‌‌‌గా 27వ స్థానం సాధించిన ఆమె ఫైనల్‌‌‌‌ చేరలేకపోయింది. మరోవైపు  స్విమ్మింగ్‌‌‌‌లో అద్వైత్‌‌‌‌, కుశాగ్ర రావత్‌‌‌‌ మెన్స్‌‌‌‌  1500 మీ. ఫ్రీస్టయిల్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌లో ఫైనల్‌‌‌‌ చేరుకున్నారు. 

రజత ‘వికాసం’ 

మెన్స్‌‌‌‌‌‌‌‌ వెయిట్‌‌‌‌‌‌‌‌ లిఫ్టింగ్‌‌‌‌‌‌‌‌ 96 కేజీల్లో వికాస్​ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ సిల్వర్‌‌‌‌‌‌‌‌  సొంతం చేసుకున్నాడు. వికాస్‌‌‌‌‌‌‌‌ మొత్తం 346 (స్నాచ్‌‌‌‌‌‌‌‌ 155+ క్లీన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ జర్క్‌‌‌‌‌‌‌‌ 191) కేజీల బరువు ఎత్తి రెండో ప్లేస్‌‌‌‌‌‌‌‌లో నిలిచాడు. వికాస్​  2014 గ్లాస్గో గేమ్స్‌‌‌‌‌‌‌‌లోసిల్వర్‌‌‌‌‌‌‌‌, 2018 గోల్డ్‌‌‌‌‌‌‌‌ కోస్ట్‌‌‌‌‌‌‌‌లో బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ సాధించాడు. స్నాచ్‌‌‌‌‌‌‌‌లో వికాస్‌‌‌‌‌‌‌‌ వరుసగా 149, 153, 155 కేజీల బరువు లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. క్లీన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ జర్క్‌‌‌‌‌‌‌‌లో తొలి రెండు ప్రయత్నాల్లో వరుసగా 187, 191 కేజీలు ఎత్తినా.. ఆఖరి ప్రయత్నంలో 190 కేజీలు లిఫ్ట్‌‌‌‌‌‌‌‌ చేయడంలో విఫలమయ్యాడు. డాన్‌‌‌‌‌‌‌‌ ఓపెలోగ్‌‌‌‌‌‌‌‌ (సమోవా) 381 కేజీలు ఎత్తి గేమ్స్‌‌‌‌‌‌‌‌ రికార్డుతో స్వర్ణం, తుసివా రైనిబోగి (ఫ్యూజి) 343 కేజీలతో బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ను దక్కించుకున్నాడు. ఇక, సోమవారం అర్ధరాత్రి జరిగిన విమెన్స్‌‌‌‌‌‌‌‌ 71 కేజీ కేటగిరీలో హర్జిందర్‌‌‌‌‌‌‌‌ కౌర్‌‌‌‌‌‌‌‌ బ్రాంజ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌తో మెరిసింది. 


కామన్వెల్త్‌‌‌‌లో నేడు

అథ్లెటిక్స్‌‌‌‌: విమెన్స్‌‌‌‌ షాట్‌‌‌‌పుట్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ (మన్‌‌‌‌ప్రీత్‌‌‌‌) రా. 12.32
బాక్సింగ్ క్వార్టర్‌‌‌‌ ఫైనల్​ బౌట్స్​: 
నీతు గాంఘస్‌‌‌‌–సా. 4.45; నిఖత్‌‌‌‌ – రా. 11.15; లవ్లీనా– రా. 12.45; 
విమెన్స్‌‌‌‌ టీ20 మ్యాచ్‌‌‌‌: 
ఇండియా–బార్బడోస్‌‌‌‌– రా.10.30
విమెన్స్‌‌‌‌ హాకీ: ఇండియా–కెనడా మ. 3.30; మెన్స్‌‌‌‌ హాకీ: ఇండియా–కెనడా– సా. 6.30
జూడో విమెన్స్‌‌‌‌ క్వార్టర్స్‌‌‌‌: తులికా మన్‌‌‌‌– మ. 2.30;
లాన్‌‌‌‌ బౌల్స్‌‌‌‌: మెన్స్‌‌‌‌ సింగిల్స్‌‌‌‌, విమెన్స్‌‌‌‌ పెయిర్‌‌‌‌, మెన్స్‌‌‌‌ ఫోర్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లు– మ. 1 నుంచి
వెయిట్‌‌‌‌ లిఫ్టింగ్ (మెడల్‌‌‌‌ ఈవెంట్):
 లోవ్‌‌‌‌ప్రీత్‌‌‌‌ సింగ్‌‌‌‌– మ. 2; పూర్ణియా పాండే– సా. 6.30; గుర్‌‌‌‌ప్రీత్‌‌‌‌ –రా. 11.