
- సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా
హైదరాబాద్: దేశ స్వాతంత్రం కోసం కాంగ్రెస్ తోపాటు ముందుండి పోరాడిన కమ్యూనిస్టు పార్టీ ప్రజా సమస్యలపై వీధుల్లో పోరాటం చేస్తోందని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా వెల్లడించారు. ఏఐవైఎఫ్ తనకు తల్లి లాంటిదన్నారు ఆయన. హైదరాబాద్ నగరంలోని విశ్వేశ్వరయ్య భవన్ లో జరిగిన ఏఐవైఎఫ్ 16వ జాతీయ మహాసభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్య పోరాటంలో ఎలాంటి పాత్ర లేని, బ్రిటీషోళ్లకు మోకరిల్లిన ఆర్ఎస్ఎస్, బీజేపీలు అధికారంలో ఉన్నాయన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న కమ్యూనిస్టు పార్టీ మాత్రం ఇంకా ప్రజాసమస్యలపైనే వీధుల్లో పోరాడుతోందని వివరించారు. మోడీ ప్రభుత్వాన్ని దింపేందుకు యువత ముందుండాలన్నారు డి.రాజా. ఈ మహాసభల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన సీపీఐ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
రాష్ట్రంలో ఇవాళ 2295 కరోనా కేసులు..ముగ్గురు మృతి
ఒమిక్రాన్ టెన్షన్: ఎట్ రిస్క్ దేశాల సంఖ్య పెంపు
వ్యాక్సిన్ వేసుకోని వారిని అనుమతిస్తే 25వేలు ఫైన్
పీఆర్సీపై ఏపీ సీఎం జగన్ కీలక ప్రకటన