
కూకట్పల్లి, వెలుగు: ఆల్విన్కాలనీ డివిజన్ పరిధిలోని ఉజ్జయిని మహంకాళినగర్లో కొత్తగా నిర్మించిన కమ్యూనిటీహాల్ ను ఆదివారం శేరిలింగంపల్లి నియోజకవర్గ బీజేపీ లీడర్ఎం.రవికుమార్యాదవ్ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అన్ని సౌకర్యాలతో కమ్యూనిటీహాల్నిర్మించిన కాలనీ కమిటీ సభ్యులను అభినందించారు. బీజేపీ సీనియర్నేత నర్సింహయాదవ్, కాలనీ నాయకులు రాము, వెంకట్, ఆంజనేయులు, పాండు, శ్రీనివాస్, రమణ, చండయ్య, చాంద్, అశోక్తదితరులు పాల్గొన్నారు.