వ్యాక్సిన్​ రిజిస్ట్రేషన్​కు కమ్యూనిటీ సర్వీస్ సెంటర్లు

వ్యాక్సిన్​ రిజిస్ట్రేషన్​కు కమ్యూనిటీ సర్వీస్ సెంటర్లు
కొవిన్​లో ఎంట్రీ చేసుకోలేని వృద్ధుల కోసం ఏర్పాటు చేయాలన్న కేంద్రం కోల్డ్​చైన్​ సిస్టమ్​ పక్కాగా ఉండాల్సిందేనని స్పష్టం హైదరాబాద్, వెలుగు: కరోనా వ్యాక్సిన్ కోసం ప్రజలు రిజిస్ట్రేషన్​చేసుకునేందుకు కమ్యూనిటీ సర్వీస్​సెంటర్లు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు సూచించింది. సొంతంగా రిజిస్ట్రేషన్​చేసుకునే చాన్స్ ఉన్నప్పటికీ  కోవిన్ సాప్ట్​వేర్​పై అవగాహనలేని వారి కోసం ఇతర ఏర్పాట్లు చేయాలని చెప్పింది. గురువారం అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులతో కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డ్రైరన్, వ్యాక్సినేషన్ ఏర్పాట్లపై రివ్యూ చేశారు. ఈ సందర్భంగా పలు విషయాలపై చర్చించారు. ఫస్ట్​ఫేజ్​లో వ్యాక్సిన్ తీసుకునే హెల్త్​కేర్ వర్కర్స్ వివరాలు కొవిన్​ సాఫ్ట్ వేర్​లో రిజిస్ట్రేషన్ చేసే విషయం హెల్త్ డిపార్ట్​మెంట్​కోఆర్డినేట్​చేస్తుంది. అయితే 50 ఏండ్లు పైబడిన, యాభై ఏండ్లలోపు ఉండి దీర్ఘకాలిక అనారోగ్యం బాధపడుతున్న వారు వ్యాక్సిన్​కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు కమ్యూనిటీ సెంటర్లు ఏర్పాటు చేయాలని తెలిపింది. ఇవి మండలాల వారీగా ఉండలా ? గ్రామాల వారీగా ఉండాలా అనేదానిపై లోకల్ పరిస్థితులకు అనుగుణంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. బ్లాక్​లెవెల్​లో రిజిస్ట్రేషన్​కు మెడికల్​ఆఫీసర్​ఇన్​చార్జిగా ఉంటారు. వ్యాక్సిన్​రిజిస్ట్రేషన్ కోసం ఓటర్ల లిస్ట్​ఉపయోగించుకోనున్నారు. వ్యాక్సినేషన్​లో లోటుపాట్లు, ఇబ్బందులు తలెత్తితే వాటిని శుక్రవారం మళ్లీ నిర్వహించే డ్రైరన్​లో పరిష్కరించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. అలాగే వ్యాక్సినేషన్​కోసం రాష్ట్రాలకు రూ.480 కోట్లు సెంట్రల్​ఫైనాన్స్​మినిస్ట్రీ విడుదల చేసింది. ఆపరేషనల్​కాస్ట్​కింద ఈ మొత్తాన్ని కేంద్రం రాష్ట్రాలకు ఇవ్వనుంది. వ్యాక్సిన్​ తీసుకునే ఒక్కో వ్యక్తికి రూ.160 చొప్పున ఖర్చు కింద ఇస్తున్నట్లు అధికారులు చెప్తున్నరు. వ్యాక్సినేషన్​పై రాష్ట్రాల చీఫ్​సెక్రటరీలతో కేబినెట్​సెక్రటరీ ఈ నెల 11న మరోసారి రివ్యూ చేయనున్నారు. త్రీ లెవెల్​వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ నేషనల్ ఎక్స్​పర్ట్​ గ్రూప్​ ఆన్​ వ్యాక్సిన్ ​అడ్మినిస్ట్రేషన్​ఫర్​కరోనా వ్యాక్సినేషన్ ను మూడు లెవెల్స్​లో పర్యవేక్షించనుంది. రాష్ట్రస్థాయిలో చీఫ్​సెక్రటరీ అధ్యక్షతన స్టేట్​స్ర్కీనింగ్​కమిటీ(ఎస్​ఎస్​సీ), ప్రిన్సిపల్​సెక్రటరీ హెల్త్​ ఆధ్వర్యంలో స్టేట్​టాస్క్​ఫోర్స్, స్టేట్​కంట్రోల్​రూమ్​పనిచేయనుంది. అలాగే జిల్లా స్థాయిలో డిస్ట్రిక్​టాస్క్​ఫోర్స్, అర్బన్​టాస్క్​ఫోర్స్, డిస్ట్రిక్​కంట్రోల్​రూం పనిచేస్తుంది. ఇక బ్లాక్​లెవెల్​లో తహసీల్దార్ ఆధ్వర్యంలో బ్లాక్​టాస్క్, బ్లాక్​కంట్రోల్​రూంలు వ్యాక్సినేషన్​ప్రక్రియలో పనిచేస్తాయి. ఎప్పటికప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గైడ్​లైన్స్, ఆర్డర్స్​ప్రకారం పనిచేయాల్సి ఉంటుంది. అన్ని రాష్ట్రాల్లోని జిల్లాల్లో, బ్లాక్​లెవెల్​లో 61 వేల మంది ప్రొగ్రామ్​మేనేజర్స్, 1.9 లక్షల వ్యాక్సినేటర్లు, 3.3 లక్షల మంది వ్యాక్సినేషన్​టీమ్​మెంబర్స్ ట్రైనింగ్​పూర్తి చేసుకున్నారు. 1075 కాల్​సెంటర్​ వ్యాక్సినేషన్​పై డౌట్లు, సమాచారం తెలుసుకునేందుకు 1075 స్టేట్​కాల్​సెంటర్​ను ఏర్పాటు చేయనున్నారు. ఇది ఒకవేళ బిజీ ఉంటే నేషనల్​హెల్త్​అథారిటీ కాల్​సెంటర్​కు, లేదా టీబీ సెంటర్​కు కాల్​ట్రాన్స్​ఫర్​చేస్తారు. For More News.. భూమి స్పీడ్​ పెరిగింది! రోజులు వేగంగా గడుస్తున్నయ్..