ఢిల్లీలో స్టార్ట్‌ అయిన కమ్యూనిటీ స్ప్రెడ్‌?

ఢిల్లీలో స్టార్ట్‌ అయిన కమ్యూనిటీ స్ప్రెడ్‌?
  • 50 శాతం కేసులకు సోర్స్‌ లేదు: హెల్త్‌ మినిస్టర్‌‌
  • కేంద్రం డిక్లేర్‌‌ చేయాలని వెల్లడి

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో కరోనా మహమ్మారి విపరీతంగా వ్యాప్తి చెందుతోంది. రోజు రోజుకు కేసులు పెరగిపోతున్నాయి. అయితే వాటిలో 50 శాతం కేసులకు సోర్స్‌ కనుకోలేకపోయారు. దీంతో ఢిల్లీలో కమ్యూనిటీ స్ప్రెడ్‌ స్టార్ట్‌ అయిపోయినట్లే అని వైద్య నిపుణులు భావిస్తున్నారు. ఈ విషయంపై ఢిల్లీ హెల్త్‌ మినిస్టర్‌‌ సత్యేంద్ర జైన్‌ కూడా స్పందించారు. ఎయిమ్స్‌ డైరెక్టర్‌‌ కూడా కమ్యూనిటీ ట్రాన్స్‌ఫర్‌‌పై మాట్లాడారని, దానిపై కేంద్రమే స్పష్టత ఇవ్వాలని ఆయన అన్నారు. ఆ విషయాన్ని కేంద్రం ఆమోదించడం లేదని, వాళ్లు ఒక ప్రకటన చేస్తే స్పష్టత వస్తుందని చెప్పారు. “ వ్యాధి ఎలా సోకిందనే దానిపై స్పష్టత లేనప్పుడు కమ్యూనిటీ స్ప్రెడ్‌ స్టార్ట్‌ అయిందనే నిర్ధారణకు వస్తాం. ఢిల్లీలోని 50 శాతం కేసులు సోర్స్‌ లేనివే. కేంద్రం చెప్పినప్పుడు మాత్రమే దానిపై ఒక స్పష్టత వస్తుంది” అని ఆయన చెప్పారు. కరోనా పెషంట్ల కోసం హాస్పిటల్స్‌లోని బెడ్లను మరిన్ని పెంచాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఢిల్లీలో కమ్యూనిటీ ట్రాన్స్‌మిషన్‌ పెరిగిందని, దానికి తగ్గట్లు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని ఎయిమ్స్‌ డాక్టర్‌‌ ఒకరు చెప్పగా.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోడియా కూడా అన్నారు. ఈ మేరకు దీనిపై చర్చించేందుకు లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌ అనిల్‌ బైజల్‌ ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం మీటింగ్‌ జరగనుంది. కరోనా వైరస్‌ లక్షణాలతో సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఈ మీటింగ్‌కు రావడం లేదు.