ఎలక్ట్రిక్ ట్రాక్ పై ఉన్న వ్యక్తిని కాపాడిన చికాగో కుర్రాడు

ఎలక్ట్రిక్ ట్రాక్ పై ఉన్న వ్యక్తిని కాపాడిన చికాగో కుర్రాడు

ఈ రోజుల్లో కళ్ల ముందే చనిపోతున్నా.. చూసీ చూడనట్టు వెళ్లే పరిస్థితి. కరోనా తర్వాత ఈ భావం మరింత పెరిగిపోయింది. పక్కనున్న మనిషి మన సొంత వాళ్లే అయినా ఏమీ తెలియనట్టు దూరంగా ఉండాల్సిన దారుణ స్థితిలో ఉన్నాం. రిస్క్ అని తెలిసి ఎవరు మాత్రం ప్రాణాలకు తెగించి కాపాడే వాళ్లు.. ఈ కాలంలో ఎంత మంది ఉంటారు. కానీ ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తిని చూస్తే మాత్రం దాన్ని చేసి చూపించాడనిపిస్తుంది. ఎలక్ట్రిక్ రైల్వే ట్రాక్ పై కొట్టుమిట్టాడుతున్న ఒక వ్యక్తిని చూసి అందరూ వదిలేసినా.. మనకేమవుతుందో అని ఆలోచించి దూరంగా ఉన్నా.. ఆ ఘటనను చూస్తున్న మరొక వ్యక్తి మాత్రం అందరి లాగా చూసి ఊరుకోలేదు. నాకేంటీ అని వెళ్లిపోలేదు. చికాగోకు చెందిన 20ఏళ్ల టోనీ పెర్రీ అనే కుర్రాడు ప్రమాదమని తెలిసినా.. ఆ రైల్వే ట్రాక్ పై ప్రాణాలతో పోరాడుతున్న వ్యక్తిని కాపాడాడు. ముందే విద్యుత్ తో కూడిన వ్యవహారం. ఏ మాత్రం అజాగ్రత్తగా వహించినా అక్కడ ఉన్న వ్యక్తితో పాటు.. కాపాడాలని వెళ్లిన ఆ కుర్రాడి ప్రాణాలూ డేంజర్లో పడ్డట్టే. కానీ అవేవీ లెక్కచేయకుండా సాహిసించిన ఆ కుర్రాడిని సన్మానించిన ఓ బిజినెస్ మెన్.. ఒక ఆడీ కారును కూడా బహుమతిగా అందజేశాడట.