పనిస్తాం.. రండి ప్లీజ్..

పనిస్తాం.. రండి ప్లీజ్..

కూలీలను బతిమాలుతున్న కంపెనీలు
విమాన టికెట్లు కొనిచ్చే పరిస్థితి

న్యూఢిల్లీ: ఒకప్పుడు మెట్రో సిటీల్లో కూలీపనులు దొరకడమే కష్టమయ్యేది. కరోనా పుణ్యమాని పరిస్థితులు తారుమారయ్యాయి. లాక్డౌన్, కరోనా కారణంగా లక్షల మంది వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లారు. కొందరైతే కాలినడకన బయల్దేరి ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇప్పటికీ కేసులు పెరుగుతూనే ఉండటంతో వెనక్కి రావడానికి ఇష్టపడటం లేదు. కొందరు రావడానికి రెడీ అవుతున్నా కుటుంబ సభ్యులు వారిస్తున్నారు. వలస కూలీలు లేకుంటే పనులు జరగవు కాబట్టి, వెనక్కి రప్పించడానికి కంపెనీలు తంటాలు పడుతున్నాయి. కొన్నికంపెనీలు విమాన టికెట్లు, మునుపటి కంటే ఎక్కువ జీతం, ఉచిత రూం వంటివి ఆశ చూపుతున్నాయి. ఇండియా ఎకానమీకి వలస కూలీలు వెన్నెముక వంటివాళ్లు. ముంబై, హైదరాబాద్ లాంటి నగరాల్లోఅయితే వీళ్లు భారీగా కనిపిస్తారు. అపార్టుమెంట్లు, ఆఫీసులు, ఇండ్లలో సెక్యూరిటీ గార్డులుగా, వంట మనుషులుగా, క్లీనర్లుగా పనిచేస్తారు. ఇండియాలో కరోనా కేసుల్లో ముంబై మొదటిస్థానంలో ఉండటంతో నగరంలోని 80 శాతం మంది వలస కూలీలు సొంతూళ్లకు వెళ్లిపోయారు. కన్స్ట్రక్షన్ వర్కర్లు దొరక్క భవన నిర్మాణ పనులు ఆగిపోయాయని మహారాష్ట్ర చాంబర్ ఆఫ్ కామర్స్ తెలియజేసింది. నాలుగు నెలల లాక్డౌన్ తరువాత ముంబైలో రిస్ట్రిక్షన్లను తగ్గించారు. దీంతో కంపెనీలు బతిమాలో సర్ది చెప్పో కొందరు వలస కూలీలను వెనక్కి రప్పించాయి. ఇప్పటికీ 10 వేల కన్స్ట్రక్షన్ సైట్లు కూలీలు లేక నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. కూలీలను విమానాల్లో తీసుకొస్తున్నామని, ఇన్సూరెన్స్ సదుపాయం కూడా కల్పిస్తున్నామని రాజేశ్ ప్రజాపతి అనే డెవెలపర్ వివరించారు. తిరిగి వచ్చిన వాళ్లందరికీ కరోనా టెస్టులు చేయించామని వెల్లడించారు. ఇప్పటికీ కూలీల కొరత బాగానే ఉందని వాపోయారు.

ఎన్నిఆఫర్లిచ్చినా…
పెద్ద రియల్టీ కంపెనీల్లో ఒకటైన హీర్ నందానీ గ్రూప్ లాక్డౌన్ కాలంలోనూ వలస కూలీలకు జీతాలు ఇచ్చింది. అయినప్పటికీ మొత్తం 4,500 మంది కూలీల్లో 30 శాతంమందిని మాత్రమే వెనక్కి రప్పించింది. వలస కూలీలకు ఉచితంగా భోజనం పెడుతూ, శానిటైజేషన్ సదుపాయాలు
కల్పించి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటున్నామని కంపెనీ కో–ఫౌండర్ నిరంజన్ హీర్ నందానీ అన్నారు. చిన్నారుల కోసం క్రెష్ ను కూడా ఏర్పాటు చేశామన్నారు. వలస కూలీల కొరతతో పాటు డబ్బు పరమైన సమస్యలు, ఆగిపోయిన ప్రాజెక్టులు కంపెనీ బాసులకు నిద్రలేకుండా చేస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్ తో ముంబై రియల్టీ మార్కెట్ 90 శాతం పడిపోయింది. అమ్మకాలు విపరీతంగా తగ్గాయి. కంపెనీలకు అప్పులు దొరకడమూ కష్టంగా మారింది. ఒకవైపు అమ్మకాల తగ్గుదల, మరోవైపు వలస కూలీల కొరతతో సతమతమవుతున్నామని ముంబై కేంద్రంగా పనిచేసే కన్సల్టెన్సీ లైజెస్ ఫోరాస్ సీఈఓ పంకజ్ కపూర్ అన్నారు. బిల్డింగులు కట్టడం ఆగిపోయింది కాబట్టి రియల్టర్లకు బ్యాంకులు అప్పులు ఇవ్వడం లేదని చెప్పారు. ఇతర బిజినెస్ల పరిస్థితి కూడా ఇలాగే ఉందని తెలియజేశారు. ప్రస్తుతం తమ సెక్టార్లో అయోమయం నెలకొందని గార్మెంట్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ఆఫ్ రాజస్థాన్ జనరల్ సెక్రెటరీ అసీమ్ కుమార్ చెప్పారు.

For More News..

చైనా బిలియనీర్ కు భారత కోర్టు సమన్లు

టూ వీలర్‌ సేల్స్‌ పెరుగుతున్నయ్‌