ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలి

ఎండిన పంటలకు పరిహారం ఇవ్వాలి
  • మండలకేంద్రాల్లో బీజేపీ లీడర్ల వినతులు 

నెట్‌‌‌‌వర్క్‌‌‌‌, వెలుగు: సాగునీరు లేక పంటలు ఎండిపోయిన రైతులకు పరిహారం ఇచ్చి ఆదుకోవాలని బీజేపీ లీడర్లు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. సోమవారం ఉమ్మడి జిల్లాలోని పలు మండల కేంద్రాల్లో ఆ పార్టీ లీడర్లు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. సిరిసిల్లలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీరుద్రమరెడ్డి అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఖీమ్యానాయక్‌‌‌‌కు వినతిపత్రం ఇచ్చారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ  కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మంగళవారం కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో చేపట్టనున్న రైతు దీక్షకు పెద్ద సంఖ్యలో తరలి రావాలని పిలుపునిచ్చారు.  వేములవాడ, కోనరావుపేట,  చందుర్తి, హుజూరాబాద్‌‌‌‌, జమ్మికుంట, కరీంనగర్‌‌‌‌‌‌‌‌ రూరల్‌‌‌‌,శంకరపట్నం  మండలకేంద్రాల్లోని తహసీల్​ ఆఫీస్‌‌‌‌ల వద్ద బీజేపీ లీడర్లు నిరసన చేపట్టి తహసీల్దార్లకు వినతిపత్రాలు అందజేశారు.         -