అత్తాపూర్ గణేష్ లడ్డూ కోసం పోటాపోటీ.. ఈ సారి రికార్డు ధర పలికిన ప్రసాదం

అత్తాపూర్ గణేష్ లడ్డూ కోసం పోటాపోటీ.. ఈ సారి రికార్డు ధర పలికిన ప్రసాదం

హైదరాబాద్ నగరంలో ఒకవైపు గణేష్ నిమజ్జనాల జోరు కొనసాగుతుంటే.. మరోవైపు లడ్డూ ప్రసాదం కోసం భక్తులు పోటీ పడుతున్నారు. ఎక్కడ చూసినా గతేడాదితో పోల్చితే వేలంలో అత్యధిక ధర పలుకుతున్నాయి లడ్డూ ప్రసాదాలు. అత్తాపూర్ లడ్డూ కూడా ఈ సారి రికార్డు ధర పలికింది. లడ్డూని గుమ్మడి బ్రదర్స్ భూపాల్ రెడ్డి  దక్కించుకున్నారు. 

అత్తాపూర్ పురాతన పోచమ్మ ఆలయం వద్ద ఉన్న "న్యూ స్టార్స్ భక్త సమాజ్" గణేశ్ లడ్డూ ప్రసాదం కోసం భక్తుల మధ్య పోటీ నెలకొంది. వేలం పాటలో గత రికార్డ్ ని బీట్ చేస్తూ రూ.12 లక్షల 51 వేల రూపాయలకు గుమ్మడి బ్రదర్స్ భూపాల్ రెడ్డి దక్కించుకున్నారు. గత ఏడాది కంటే.. ఈసారి 1 లక్ష 35 వేల రూపాయలు అదనంగా లడ్డూ ధర పలికింది. అత్తాపూర్ లో లడ్డూ వేలంలో ఇదే రికార్డ్.

►ALSO READ | సామాన్యుడిలా ట్యాంక్ బండ్పై సీఎం రేవంత్ రెడ్డి: భక్తులతో మమేకం.. నిమజ్జనంలో సందడి

అత్తాపూర్ లడ్డూ ప్రసాదం వేలం హోరాహోరీగా సాగింది. అత్తాపూర్ గణేశుడితో పాటు పది రోజులు భక్తులతో పూజలను అందుకున్న లడ్డూ రికార్డ్ ధర పలికింది. అత్తాపూర్  "న్యూ స్టార్స్ భక్త సమాజ్" కమిటీ గణేష్ సభ్యులు, నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిపారు. లడ్డూ ప్రసాదం దక్కించుకునేందుకు భక్తులు చివరి వరకు పోటీ పడ్డారు. 

నిమజ్జనం సందర్భంగా నిర్వహించిన వేలంపాటలో దాదాపు 50 మంది సభ్యులు పాల్గొన్నారు.  గతేడాది కంటే 1 లక్ష 35 వేల రూపాయలు అదనంగా వెచ్చించి లడ్డూను సొంతం చేసుకున్నారుగుమ్మడి బ్రదర్స్ భూపాల్ రెడ్డి.