
- ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించాలి ..సీపీ అంబర్ కిశోర్ ఝా
బెల్లంపల్లి వెలుగు: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా ప్రవర్తించా లని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా పోలీసు అధికారులు, సిబ్బందికి సూచించారు. గురువారం మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసులు, రికార్డులను పరిశీలించారు.
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. స్టేషన్‌లోని ఫైళ్లు, రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సీపీ వెంట మంచిర్యాల డీసీపీ భాస్కర్, బెల్లంపల్లి ఏసీపీ ఎ.రవికుమార్, రూరల్ ఇన్స్పెక్టర్ హనూక్, టూ టౌన్ ఎస్సై కిరణ్‌కుమార్ తదితరులున్నారు.