సోమేశ్​పై సీబీఐ, ఈడీకి ఫిర్యాదు

సోమేశ్​పై సీబీఐ, ఈడీకి ఫిర్యాదు
  • భారీగా అక్రమాస్తులు కూడబెట్టాడని యాక్షన్ ఫర్ యాంటీ కరప్షన్ కన్వీనర్ లేఖ

హైదరాబాద్, వెలుగు : మాజీ సీఎస్‌‌  సోమేశ్ కుమార్‌‌  భారీగా అక్రమాస్తులు కూడబెట్టారని యాక్షన్ ఫర్  యాంటీ కరప్షన్  కన్వీనర్‌‌  శ్రీకాంత్.. సీబీఐ,ఈడీకి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎస్‌‌గా సోమేశ్  అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. ఈ మేరకు సీబీఐ,ఈడీకి స్పీడ్‌‌ పోస్టులో లెటర్  పంపించారు. సోమేశ్  తన కుటుంబ సభ్యులు, బినామీల పేరిట ఆస్తులు రిజిస్ట్రేషన్  చేయించారని ఆ లేఖలో శ్రీకాంత్  పేర్కొన్నారు.

గురుగ్రాంలో కమర్షియల్ కాంప్లెక్స్‌‌లు, నోయిడాలో బినామీల పేరుతో విలువైన స్థలాలు కొనుగోలు చేశారని ఆరోపించారు.‘‘పలువురు రాజకీయ నేతలకు అనుకూలంగా సోమేశ్  వివాదాస్పద జీవోలు జారీ చేశాడు. యాచారంలో తన భార్య పేరిట 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు.

ఫైనాన్షియల్‌‌  డిస్ట్రిక్ట్‌‌లోనూ ఆయనకు కమర్షియల్ కాంప్లెక్స్‌‌లు ఉన్నాయి. ఆయన అక్రమాస్తులపై స్పెషల్ టీమ్స్‌‌  ఏర్పాటు చేసి సమగ్ర దర్యాప్తు జరపాలి” అని శ్రీకాంత్  పేర్కొన్నారు.