హుస్నాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ నేత బాల్క సుమన్ చేసిన వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకుని, ఆయనను వెంటనే అరెస్ట్ చేయాలని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు అక్కు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, రైలు పట్టాల విరగగొట్టడం, సింగరేణి భవనాల కూల్చివేతలపై సుమన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఉన్నాయన్నారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పూదరి వరప్రసాద్, నాయకులు కృష్ణస్వామి, పున్న సది, రంజిత్, భాస్కర్ నాయక్, రాజు నాయక్ పాల్గొన్నారు.
