
పుదుచ్చేరి: కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో పూర్తి లాక్‌డౌన్ విధించారు. శుక్రవారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు లాక్‌డౌన్ ఆంక్షలు అమలులోకి రానున్నాయి. గత మంగళవారం నుంచి పుదుచ్చేరిలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతుండగా కరోనా పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో లాక్‌డౌన్ విధించాలని నిర్ణయించారు. పుదుచ్చేరిలో గురువారం ఒక్కరోజే 987 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఓవరాల్‌గా నమోదైన కేసుల సంఖ్య 50,580 అని హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ సీనియర్ అధికారి తెలిపారు.