పలు రైళ్లను కుదించిన రైల్వే శాఖ: వివరాలు ఇవే...

పలు రైళ్లను  కుదించిన రైల్వే శాఖ: వివరాలు ఇవే...

సౌత్ సెంట్రల్ రైల్వే ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ చెప్పింది. కాజీపేట రైల్వే జంక్షన్‌లోని బలార్షా సెక్షన్‌లో మూడో లైన్ ఇంటర్‌లాకింగ్, నాన్ ఇంటర్‌లాకింగ్ పనులు జరుగుతున్నాయి.  దీంతో  ఇంటర్‌సిటీ, భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్   రైళ్లు  బెల్లంపల్లి వరకే నడుస్తాయని  దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.  సెప్టెంబర్ 26 వరకు హైదరాబాద్ - సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య నడిచే ఇంటర్‌సిటీ రైలు, సికింద్రాబాద్ - బలార్ష మధ్య నడిచే భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ రైలు,  సిర్పూర్ కాగజ్‌నగర్ ,  రెండు ప్రధాన రైల్వే స్టేషన్‌లలో మూడవ లైన్ పనులు జరుగుతున్నందున బెల్లంపల్లి వరకే నడుస్తాయి. బెల్లంపల్లి- బలార్ష సెక్షన్‌ మూడో లైన్‌ పనులు పూర్తి కావస్తున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు.  ఇప్పటికే  రద్దు చేసిన రామగిరి, సింగరేణి, డోర్నకల్ ప్యాసింజర్, కాకతీయ రైళ్ల రద్దును అక్టోబర్ 2 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు.

ALSO READ :బీరు, బ్రాందీ అమ్మితేగానీ ఉద్యోగులకు జీతాలియ్యలేని పరిస్థితి: కిషన్ రెడ్డి

సికింద్రాబాద్-దానాపూర్ రైళ్ల మళ్లింపు..

బీహార్‌లోని సికింద్రాబాద్-దానాపూర్ మధ్య నడిచే రైళ్లను (రైలు నంబర్ 12791 మరియు 12792) సెప్టెంబర్ 10 నుండి అక్టోబర్ 15 వరకు దారి మళ్లిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.  జంక్షన్ మార్గంలో, ఈ రైళ్లు ప్రయాగ్‌రాజ్, మీర్జాపూర్ మరియు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ మార్గంలో నడుస్తాయి.