నిజాంపేటలో అర్హులకు ఇండ్లు రాలేదని ఆందోళన

నిజాంపేటలో అర్హులకు ఇండ్లు రాలేదని ఆందోళన

నిజాంపేట, వెలుగు: మేము ఓట్లు వేయడానికి మాత్రమే పనికొస్తామా.. డబుల్ బెడ్ రూమ్ స్కీంకి పనికిరామా' అని నందిగామ మహిళలు ప్రశ్నించారు. గ్రామంలో అర్హులైన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రాలేదని ఆందోళన చేపట్టారు. ఆదివారం నిజాంపేట ఎంపీపీ సిద్దరాములు, తహసీల్దార్​ సురేశ్​ కుమార్, సర్పంచ్ ప్రీతి, ఎంపీటీసీ సురేశ్​లు కలిసి లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను అందజేశారు. కాగా గ్రామ సభ నిర్వహించకుండా డబుల్ ఇళ్ల ను ఎలా కేటాయిస్తారని గ్రామస్తులు మండిపడ్డారు.

 ఈ విషయంలో బీఆర్​ఎస్​ నాయకులు సీక్రెట్​ మెయింటెన్​ చేశారని ఆరోపించారు.  అర్హులైన వారి పేర్లు చదివి వినిపించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేయగా తహసీల్దార్​30 మంది పేర్లను చదివి వినిపించారు. ఇందులో  అనర్హులైన ఇద్దరి ఇళ్ల పట్టాలను పక్కన పెట్టారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు రాజశేఖర్, జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ స్కీమ్ నిజమైన లబ్ధిదారులకు అందడం లేదన్నారు.