రెగ్యులరైజ్ చేయాలంటూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆందోళన

రెగ్యులరైజ్ చేయాలంటూ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆందోళన
  • కోఠి మహిళా వర్సిటీలో ర్యాలీ.. అడ్డుకున్న పోలీసులు

బషీర్​బాగ్, వెలుగు:  తమను రెగ్యులరైజ్ చేయాలంటూ కోఠి మహిళా వర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు బుధవారం పెన్ డౌన్ చేసి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 12 వర్సిటీల్లో ఉన్న 1400 మంది కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఈ నెల 4 నుంచి తాము ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అనంతరం వర్సిటీ గేటు నుంచి రోడ్డుపైకి ర్యాలీగా వెళ్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను పోలీసులు అడ్డుకు న్నారు. బయటకు వెళ్లకుండా గేట్లకు  తాళాలు వేయడంతో వారు పోలీసులతో వాగ్వాదానికి దిగారు.  అక్కడే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  కార్యక్రమంలో కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు నర్సింహా రావు , ఉపేందర్ , దీపిక తదితరులు పాల్గొన్నారు.