బాబును టీచర్ కొట్టారని..పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్

బాబును టీచర్ కొట్టారని..పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్

స్కూల్లో విద్యార్ధులు తప్పు చేస్తే.. టీచర్లు మందలిస్తుంటారు. స్కూల్ కు ఆలస్యంగా వచ్చినా.. హోంవర్క్ చేయకపోతే.. ఉపాధ్యాయులు అందుకు తగిన పనిష్మెంట్ ఇస్తుంటారు. కొందరు టీచర్లు సహనం కోల్పోయి బెత్తం పుచ్చుకుని ఒంటిపై వాతలు పడేలా, చేతులు కందిపోయేలా దండిస్తుంటారు. సరిగ్గా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో చోటు చేసుకుంది. చైతన్యపురిలో ప్రిన్స్ హై స్కూల్ ఉంది. స్థానికంగా నివాసం ఉంటున్న ఓ కుటుంబం తమ ఐదేళ్ల కుమారుడిని ఆ స్కూల్లో జాయిన్ చేశారు.

నర్సరీ చదువుతున్న తమ కుమారుడిని టీచర్ కొట్టారని తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ఏ టీచర్ కొట్టారని ప్రశ్నించినా రిసెప్షనిస్ట్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదన్నారు. దీంతో తాము స్కూల్ ప్రిన్స్ పాల్ ను నిలదీయడం జరిగిందని పేరెంట్స్ చెప్పుకొచ్చారు. రాయకపోతే కొట్టి ఉండొచ్చని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని మండిపడ్డారు. తప్పు చేస్తే మందలించాలే తప్ప శరీరంపై వాతలు పడేలా కొడతారా అని నిలదీశారు. దీనిపై బాబు కుటుంబ సభ్యులు MEOతో పాటు, చైతన్యపురి పోలీసులకు కంప్లైంట్ చేశారు.