బస్ భవన్ ముట్టడి.. ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్లు అరెస్ట్

బస్ భవన్ ముట్టడి.. ఆర్టీసీ అద్దె బస్సుల ఓనర్లు అరెస్ట్

బస్ భవన్  ముట్టడికి యత్నించారు ఆర్టీసీ అద్దెబస్సుల యజమానులు. పెండింగ్  బిల్లులను చెల్లించాలని డిమాండ్  చేశారు. బస్ బవన్  వైపు దూసుకెళ్తున్న ఆందోళన కారులను పోలీసులు అడ్డుకున్నారు.  25 శాతం బస్సులను మాత్రమే నడిపించేందుకు ఆర్టీసీ అనుమతిచ్చిందన్నారు అద్దె బస్సుల యజమానులు.  వాటికి కూడా సరిగ్గా బిల్లులు చెల్లించడంలేదని ఆరోపించారు.  తమపై ఆధారపడిన చాలా కుటుంబాలు రోడ్డున పడతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అద్దె బస్సులను పూర్తి స్థాయిలో నడపాలని డిమాండ్ చేశారు. మరోవైపు అద్దె బస్సుల యజమానులను జిల్లాల నుంచి హైదరాబాద్ కు రాకుండా ఎక్కడికక్కడ అడ్డుకుని అరెస్టులు చేస్తున్నారు పోలీసులు.

రాజ్యసభలో గందరగోళం.. 8 మంది ఎంపీలు సస్పెండ్

రాష్ట్రంలో మరో 1302 కేసులు..9 మంది మృతి

కుప్పకూలిన మూడంతస్తుల బిల్డింగ్..8 మంది మృతి