ముగిసిన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం

ముగిసిన బీఆర్ఎస్  పార్లమెంటరీ పార్టీ సమావేశం

బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం ముగిసింది. ఈ నెల 31 నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు కేసీఆర్ దిశానిర్ధేశం చేశారు. ప్రగతిభవన్లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించాలని పార్టీ నిర్ణయించింది. బడ్జెట్ ప్రసంగం రోజు ఎలా వ్యవహరించాలనే దానిపై అదే రోజు నిర్ణయం తీసుకోనున్నారు. సీఎం కేసీఆర్ ఏ రోజు వ్యూహం ఆ రోజే ఖరారు చేయనుననారు. ఈ సమావేశంలో బడ్జెట్‌లో కేటాయింపులు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, కేంద్రం నెరవేర్చని విభజన హామీలు సహా పలు అంశాలపై చర్చించారు. ఫిబ్రవరి 1న కేంద్రం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది.