భార్యతో ట్రంప్‎కు లొల్లి..! అసలేమైందంటే..?

భార్యతో ట్రంప్‎కు లొల్లి..! అసలేమైందంటే..?

న్యూయార్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ట్రంప్, ఆయన భార్య మెలానియా మధ్య లొల్లి జరుగుతున్నట్లుగా ఉన్న ఓ వీడియో సోషల్​మీడియాను షేక్​చేస్తున్నది. దీనిపై రకరకాల కథనాలు బయటకు వస్తున్నాయి. ఫ్యామిలీ పంచాది అని కొందరు.. అలాంటిదేమీ లేదని, ఇటీవల ఇద్దరు ఎక్కుతున్న ఎస్కలేటర్​ఆగిపోవడంపై చర్చ జరిగిందని మరికొందరు అంటున్నారు. 

వీడియోలో ఆడియో లేకపోవడంతో ట్రంప్ దంపతుల లిప్స్, హావభావాలను సింక్​ చేస్తూ పలువురు సంభాషణలు జోడిస్తున్నారు. అసలేం జరిగిందంటే..! ఇటీవల యూఎన్ సమావేశాల్లో పాల్గొనేందుకు ట్రంప్​దంపతులు వెళ్లారు. తిరిగి హెలికాప్టర్‎లో వైట్​హౌస్‎కు బయలుదేరారు. మార్గమధ్యలో మెలానియా వైపు ట్రంప్​వేలెత్తి చూపిస్తున్నట్లు, ట్రంప్​వైపు తన చేతులతో ‘ఆపండి’ అన్నట్లుగా మెలానియా సైగ్​చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది.