
హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా యూనివర్సిటీ ఎగ్జామినేషన్ విభాగంలో ఎన్ని ఆధునిక వ్యవస్థలు వచ్చినా ఫలితాలు వెల్లడి అయినప్పుడల్లా స్టూడెంట్స్ కు తిప్పలు తప్పడం లేదు. ఓయూలో సెమిస్టర్ ప్రారంభమయ్యాక ఎగ్జామినేషన్ విభాగంపై ఒత్తిడి మరింత పెరిగింది. దీంతో ఆన్‍స్క్రీన్ ఎవాల్యుయేషన్‍ను ప్రవేశపెట్టారు. ఈ విధానంలో కచ్చితత్వంతో పాటు వేగంగా ఫలితాలు రిలీజ్ చేసేందుకు వీలవుతుందని వర్సిటీ అధికారులు తెలిపారు. ఇటీవల విడుదలైన అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ లో పలు తప్పిదాలు జరిగాయని స్టూడెంట్స్ యూనియన్ నేతలు ఆందోళనలు నిర్వహించిన సంగతి తెలిసిందే.. కాలేజీ మేనేజ్ మెంట్ స్టూడెంట్స్ సబ్జెక్ట్ టైటిల్స్ అప్ లోడ్ చేసే సమయంలో తప్పిదాల కారణంగా వారికి ఇబ్బం దులు ఎదురవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
అయితే రీ ఎవాల్యుయేషన్‍కు అప్లై చేసుకునేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఎగ్జామ్ కు అటెండ్ అయినా ఆబ్సెంట్ చూపారని స్టూడెంట్స్ సైతం ఆందోళనలో పాల్గొన్నారు. తక్కువగా పాస్ పర్సంటేజీ ఓయూలో డిగ్రీ(సీబీసీఎస్) బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఎస్ డబ్ల్ యూ సబ్జెక్టుల్లో 1, 3, 5 సెమిస్టర్ (రెగ్యులర్) స్టూడెంట్స్ ఫలితాలు ఇటీవల విడుదలయ్యాయి. అన్ని సబ్జెక్టులు కలిపి ఫస్ట్ సెమిస్టర్‍లో సమారు 79,785 వేల మంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయగా.. 30,239 మంది మాత్రమే పాసయ్యారు. 37.90 శాతం మాత్రమే వచ్చింది. అన్ని సెమిస్టర్‍లో స్టూడెంట్స్ భారీగా ఫెయిల్ అవ్వడంతో ఎవాల్యుయేషన్ తీరుపై స్టూడెంట్స్ యూనియన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. కాలేజీ స్థాయిలోనే పొరపాట్లు టెక్నాలజీ సాయంతో పని సులువుగా మారినా..మానవ తప్పిదాల కారణంగా ఆన్‍లైన్ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది. డిగ్రీ ఫలితాల్లో కూడా ఇదే జరిగిందని అధికారులు అంటున్నారు. డిగ్రీ స్టూడెంట్స్ ఎగ్జామ్ సబ్జెక్ట్ టైటిల్స్ ను తప్పుగా నమోదు చేయడంతోనే గందరగోళ పరిస్థితులు తలెత్తాయంటున్నారు.
22 వరకు గడువు
వితౌట్ లేట్ ఫీజుతో ఫిబ్రవరి 22లోగా అప్లై చేసుకోవాలని కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ శ్రీరాం వెంకటేష్ తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు రూ.300 చొప్పున చెల్లించాలన్నారు. ఎవాల్యుయేషన్ చేసిన ఆన్సర్ షీట్ ఫోటో కాపీ పొందాలంటే రూ.1000 చెల్లించి ఎగ్జామినేషన్ బ్రాంచీలో అప్లై చేసుకోవాలన్నారు. వెబ్ ట్ నుంచి స్టూడెంట్స్ గ్రేడ్ కార్డులను డౌన్‍లోడ్ చేసుకోవాలని, అనుమానాలు, ఆన్సర్ షీట్ ఫొటోటైప్ కు అప్లై చేసుకోవాలని సూచిం చారు. రూ.200 ఫైన్‍తో ఫిబ్రవరి 26 వరకు రీ ఎవాల్యుయేషన్‍కు అప్లై చేసుకునే అవకాశం ఉందన్నారు.
స్టూడెంట్స్ అప్రమత్తంగా ఉండాలి
ఆన్ స్క్రీన్ ఎవాల్యుయేషన్ పొరబాట్లు జరగడం లేదు. కాలేజీలు స్టూడెంట్స్ సబ్జెక్టు టైటిల్స్ ను అప్ డ్ చేయడంలో పొరపాట్ల కారణంగానే ఫలితాల్లో ఎర్రర్స్ చోటు చేసుకున్నాయి. ఎవాల్యుయేషన్ కు సంబంధించి పేపర్లకు వేర్వేరు కోడ్లు ఉంటాయి. కోడ్ మారితే స్టూడెంట్స్ అబ్సెంట్ అని చూపెడుతుంది. కాలేజీలు, స్టూడెంట్స్ తాము ఏ ఎగ్జామ్ కు అప్లై చేశాం, హాల్ టికెట్ వచ్చిన సబ్జెక్టులు ఏంటీ, ఏ పేపర్ అటెంప్ట్ చేశామో ఒకసారి చెక్ చేసుకుంటే సమస్యలు తలెత్తవు. – ప్రొ.శ్రీరాం వెంకటేశ్, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జా మినేషన్, ఓయూ