వర్ష బొల్లమ్మ లీడ్ రోల్‌లో నటించిన రీసెంట్ తెలుగు క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ‘కానిస్టేబుల్ కనకం’. ప్రశాంత్ కుమార్ దిమ్మల తెరకెక్కించాడు. కోవెలమూడి సత్య సాయిబాబా, వేటూరి హేమంత్ కుమార్ నిర్మించారు. రాజీవ్ కనకాల, మేఘలేఖ, రమణ భార్గవ్ కీలక పాత్రలు పోషించారు. సురేష్ బొబ్బిలి సంగీతం అందించారు. శ్రీరామ్ ముక్కపాటి సినిమాటోగ్రఫీగా వర్క్ చేశారు.
‘కానిస్టేబుల్ కనకం’ సీజన్ 1 ఓటీటీ:
‘కానిస్టేబుల్ కనకం’ వెబ్ సిరీస్ 2025 ఆగస్టు 14 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతోంది. రిలీజైన ఫస్ట్ డే నుంచే, ఈటీవీ విన్ ట్రెండింగ్ సినిమాల్లో టాప్ 5 మూవీస్ లో ఒకటిగా దూసుకెళ్తోంది. అందుకు ముఖ్య కారణం రూరల్ మిస్టరీ కథ, అందులోని సస్పెన్స్ అంశాలతో ఈ సిరీస్ తెరకెక్కడం విశేషం.
శ్రీకాకుళం జిల్లా అడవి ప్రాంతంలోని ఓ మారుమూల పల్లెటూరిలో కానిస్టేబుల్ కనకం కథ మొదలవుతుంది. అక్కడ వరుసగా అమ్మాయిలు అదృశ్యమవ్వడంతో తీవ్ర భయాందోళనలో ఉంటుంది ఆ గ్రామం. ఇలా ఎందుకు అవుతుందనేది అదొక మిస్టరీగా మిగిలిపోతుంది. ఈ క్రమంలో కొత్తగా విధుల్లో చేరిన కానిస్టేబుల్ కనకం.. ఆ ఊరికి ఎంట్రీ ఇస్తుంది. అలా మిస్టరీని ఛేదించే దిశగా.. కనకానికి ఎదురయ్యే సంఘటనల ఏంటనేది మిగతా కథ.
సీజన్ 2 అప్డేట్:
‘కానిస్టేబుల్ కనకం’ సీజన్ 2 అప్డేట్ ఇచ్చారు మేకర్స్. లేటెస్ట్గా ఈటీవీ విన్ స్పెషల్ నోట్ రిలీజ్ చేస్తూ.. సీజన్ 2 వివరాలు వెల్లడించింది. “మీరందరూ కానిస్టేబుల్ కనకంను మళ్లీ చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రతి వ్యూ, ప్రతి మెసేజ్.. అసలు చంద్రిక ఎక్కడ? అనే ప్రతి మాట మాకు మరింత ప్రత్యేకంగా మారుస్తోంది. కానీ, సీజన్ 2 స్టోరీ ఇక్కడితో కంప్లీట్ అవ్వలేదు. అందుకు మరికొన్ని రోజులు వేచి చూడండి.
ఎందుకంటే రెండో సీజన్ వచ్చే నెల డిసెంబర్లో వస్తోంది. థ్రిల్, మిస్టరీ, ఎమోషన్స్ని రెట్టింపు చేయడానికి వచ్చేస్తోంది. అడవి తుఫాను కోసం సిద్ధంగా ఉండండి” అని ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ పోస్ట్ చేసింది. ఈ క్రేజీ అప్డేట్తో తెలుగు ఆడియన్స్ ఖుషి అవుతున్నారు. ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెండో సీజన్ స్ట్రీమింగ్ అప్డేట్.. చాలా తొందరగానే ఇచ్చారు.. మిస్టరీ థ్రిల్ కోసం వెయిటింగ్ అని ఆడియన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
You’re rewatching. We’re watching you. 👀
— ETV Win (@etvwin) November 4, 2025
Get ready Kanakam returns next month with double the fire! 🔥🚔#ConstableKanakam pic.twitter.com/hdcEv8cejj
కానిస్టేబుల్ కనకం సీజన్ కథ:
1990ల కాలంలో ఈ కథ నడుస్తుంది. శ్రీకాకుళంలోని రేపల్లె అనే మారుమూల గ్రామం. ఈ గ్రామంలో అడవి గుట్ట అనే ఒక రహస్య ప్రాంతం ఉంటుంది. దట్టమైన అడవి, భయపెట్టే పరిసరాలతో ఇది నిండుకుని ఉంటుంది. ఈ ప్రాంతంలోకి వెళ్లిన మహిళలు ఒక్కొక్కరిగా కనిపించకుండా పోతుంటారు. ఈ క్రమంలో ఆ గ్రామస్థులు ఓ కఠిన నిర్ణయం తీసుకుంటారు. ఇదే టైంలో రేపల్లెలో కనక మహాలక్ష్మి అలియాస్ కనకం(వర్ష బొల్లమ్మ) కానిస్టేబుల్‌గా పోస్టింగ్ తీసుకుంటుంది. ఒక రోజు కనకం స్నేహితురాలు చంద్రిక (మేఘ లేఖ) కనిపించకుండా పోతుంది.
అసలు ఆ గ్రామస్థులు తీసుకున్న కఠిన నిర్ణయం ఏమిటీ? కనిపించకుండా పోయిన మహిళలు ఏమయ్యారు? అసలు చంద్రిక ఏమైంది? మిస్టరీని ఛేదించాలన్న లక్ష్యంతో ఉన్న కనకనాకి ఎలాంటి సంఘటనలు ఎదురయ్యాయి? ఈ అదృశ్య మహిళల వెనకాల దాగున్న చీకటి రహస్యం ఏంటీ? చివరికి కనకం కనుక్కుందా? అనేది ఈ సిరీస్ కథ.
Investigation start… thrills nonstop! 🎯#ConstableKanakam Streaming now ▶️: https://t.co/Uxro2eTtJk
— ETV Win (@etvwin) August 13, 2025
A Win Original Series@VarshaBollamma @RajeevCo
Story - Screenplay - Dialogues - Direction : @dimmalaprasanth
🎥 #SriramMukkupati
🎶 @sureshbobbili9
💵… pic.twitter.com/oxz7C0qpDP
