టీఆర్ఎస్ నాయకుల జోక్యంతోనే రికార్డుల్లో గంరదగోళం

టీఆర్ఎస్ నాయకుల జోక్యంతోనే రికార్డుల్లో గంరదగోళం

వరంగల్ : ఎల్ ఆర్ ఎస్ అంటే పేద మద్య తరగతి వారిపై భారం వేయడమేనన్నారు టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్. సోమవారం ఆయన వరంగల్ లో మీడియాతో మాట్లాడుతూ.. మద్య తరగతివారు పన్నులు కట్టలేక భూములు వదులుకునే పరిస్థితి ఉందన్నారు. కరోనా టైమ్ లో ఈ స్కీమ్ ప్రజలపై భారం పడుతుందని.. అందుకే ప్రస్తుతం ఈస్కీమ్ ను సస్పెండ్ చేయాలన్నారు. ప్రైవేటు ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ఉపాధి కల్పించాలన్న కోదండరామ్.. లేదంటే  రూ.7వేల భృతి ఇవ్వాలన్నారు. ఆదాయ భద్రత కల్పించాలని..రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందేనన్నారు కోదండరామ్.

ఉద్యోగులు, రైతుల హక్కులకు భంగం కలగొద్దని వీఆర్వోలను బాధ్యులను చేయవద్దన్నారు కోదండరామ్. టీఆర్ఎస్, రాజకీయ నాయకుల జోక్యం కారణంగానే రికార్డులు గంరదగోళంగా మారాయని..మితిమీరిన రాజకీయ జోక్యం నిలువరించాలన్నారు. తొందరపడి బిల్లు పాస్ చేయకుండా చర్చ పెట్టాలని.. అందరి సూచనలు పరిగణనలోకి తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అనుకున్నదే చేయకుండా… పేద మధ్యతరగతి వర్గాలకు న్యాయం జరిగేలా నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. పేద, మధ్య తరగతి ప్రజల హక్కుల కోసం కొట్లాడతామన్న కోదండరాం.. వరంగల్ లో వరదల కారణంగా ప్రజలు తీవ్రంగా నష్టపోయారన్నారు.