గందరగోళంగా నామినేషన్ల విత్ డ్రా

 గందరగోళంగా నామినేషన్ల విత్ డ్రా

తీవ్ర ఉత్కంఠ తర్వాత ఆదిలాబాద్ ఎమ్మెల్సీ బరిలో ఇద్దరు అభ్యర్థులు ఉన్నట్లు ప్రకటించారు అధికారులు. టీఆర్ఎస్ తరఫున విఠల్, స్వతంత్ర అభ్యర్థిగా పుష్ప బరిలో ఉన్నారు. మరో స్వతంత్ర అభ్యర్థి TRS ZPTC రాజేశ్వరరెడ్డి విత్ డ్రా అయినట్లు ప్రకటించారు అధికారులు. అయితే తాను విత్ డ్రా చేసుకోలేదని.. తన తరఫున ఎవరో విత్ డ్రా ఫాం ఇచ్చారని ఈసీకి ఫిర్యాదు చేశారు రాజేశ్వరరెడ్డి

ఇక మరో అభ్యర్థి పుష్ప తరఫున మద్దతుదారులమంటూ విత్ డ్రా ఫాం అధికారులకు ఇచ్చారు. అయితే తాను అసలు విత్ డ్రా చేసుకోలేదని చెబుతున్నారు పుష్ప. తన తరఫున ఎవరు విత్ డ్రా ఫాం ఇచ్చారో కూడా తెలియదని ఆమె చెప్పారు. దీనిపై ఆమె కలెక్టరేట్ దగ్గర నిరసన కూడా చేశారు. ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. 

అయితే బరిలో ఉన్న అభ్యర్థులను ప్రకటించడానికి ఎందుకు లేటు చేస్తున్నారంటూ కలెక్టరేట్ లో బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. వీళ్లను TRS లీడర్లు అడ్డుకోవడంతో రెండు పార్టీల మధ్య గొడవ జరిగింది. ఒకరినొకరు తోసుకున్నారు. పోలీసులు మాత్రం బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అక్కడ గొడవ కంటిన్యూ అవుతోంది. అధికారులు TRSకు అనుకూలంగా పనిచేస్తున్నారని మండిపడుతున్నారు బీజేపీ నేతలు.