గ్రేటర్ జనాభా, ఓటర్ల సంఖ్యపై లెక్కల్లో తేడా?

గ్రేటర్ జనాభా, ఓటర్ల సంఖ్యపై లెక్కల్లో తేడా?
  • ప్రతిసారి పోలింగ్​ శాతం తగ్గడంపై అనుమానాలు
  • ఓటర్ల నమోదు, తప్పుడు,రిపిటీషన్ ఓట్ల తొలగింపు సరిగా లేదన్న విమర్శలు

హైదరాబాద్, వెలుగుగ్రేటర్​ హైదరాబాద్ లోని జనాభా, ఓటర్ల సంఖ్యపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది. ఓటింగ్​ శాతం  తక్కువగా నమోదవడంతో..  ఓటర్ల జాబితా సరిగ్గానే ఉందా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈసారి స్టేట్​ ఎలక్షన్​ కమిషన్​ ప్రకటించిన ప్రకారం.. జీహెచ్ఎంసీలో 74 లక్షల 44 వేల మంది ఓటర్లు ఉన్నారు. గత జీహెచ్ఎంసీ ఎన్నికల నాటితో పోలిస్తే.. 14 వేల మంది ఓటర్లు పెరిగారు. లిస్టులో ఇంత భారీ సంఖ్యలో ఓటర్లు ఉన్నా పోలింగ్​ మాత్రం  తక్కువగా నమోదైంది. మంగళవారం సాయంత్రం 5 గంటల వరకు కూడా సగటు ఓటింగ్​ 36.73 శాతానికే పరిమితమైంది. సెలబ్రిటీలు, ప్రముఖులతో ఓటు హక్కు వినియోగంపై ఈసీ ప్రత్యేక అవగాహన కల్పించింది. స్వచ్ఛంద సంస్థలు, సిటిజన్లు​ ఓటేయానలి  సోషల్​మీడియాలో ప్రచారం చేశారు. అయినా పోలింగ్​ శాతం పెరగలేదు.

ప్రతిసారీ ఇంతే..

ఓటర్లకు ఆసక్తి లేకపోవడం, కరోనా ఎఫెక్ట్​ వంటి కారణాలను బయటికి చెప్తున్నా.. ప్రతిసారీ గ్రేటర్​  పరిధిలో చాలా తక్కువగా ఓటింగ్​ నమోదవడంపై ఎన్నో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఓటర్ల జాబితాలో లోటుపాట్లు ఉన్నాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్ల జాబితా రెడీ చేయడం, తప్పుడు, రిపిటీషన్​ ఓట్ల తొలగింపు   పకడ్బందీగా చేపట్టాల్సి ఉందన్న అభిప్రాయాలు వస్తున్నాయి. ఓటర్లు జాబితాలో పేరు నమోదు చేసుకునే విషయంలో చూపిస్తున్న చొరవ.. ఇండ్లు మారినప్పుడో, సిటీని వదిలి వెళ్తున్నప్పుడో, చనిపోయినప్పుడు జాబితాలో పేర్లు తొలగించడంలోనో చూపడం లేదు. దీనివల్ల హైదరాబాద్​ ఓటర్ల జాబితాలో కొందరి పేర్లు రెండు, మూడు చోట్ల ఉన్నాయని ఎక్స్​పర్టులు చెప్తున్నారు. టెకీలు, యువత ఓటు హక్కు నమోదు చేసుకుంటున్నా ఓటేయడానికి రావడం లేదు.

సగటు లెక్కకు మించి..

జనాభా, ఓటర్ల లెక్కల టెక్నికల్​ అంచనాల మేర కు.. ప్రతి 100 మంది జనాభాకు 67 మంది ఓటర్లుండాలి. పెద్ద సిటీల్లో 70 మంది వరకు ఓట ర్లు ఉంటరు. గ్రేటర్​ హైదరాబాద్‌లో 2011 జనాభా లెక్కల ప్రకారం 68 లక్షల మంది, 2014 సామాజిక సర్వే ప్రకారం 78 లక్షల మంది జనాభా ఉన్నారు. ప్రస్తుతం సిటీ జనాభా కోటి అనుకున్నా 70 లక్షల మంది వరకు ఓటర్లు ఉండాలి. కానీ 74 లక్షల 44 వేల మంది ఉన్నారు. ఈ లెక్కన సిటీ జనాభా అయినా ఎక్కువగా ఉండాలి. ఓటర్ల సంఖ్య అయినా తక్కువుండాలి.

అడుగడుగునా తప్పిదాలే

జీహెచ్ఎంసీ ఓటర్ల జాబితాను పరిశీలిస్తే.. లెక్కలేనన్ని తప్పులన్నీ బయటపడ తాయి. జనాభాకు, ఓటర్ల సంఖ్యకు పొంతన ఉండదు. ఓటర్లకు.. పోలింగ్​కు  లెక్క కుదరదు. సరైన జాబితా తయారీలో ఎస్‌ఈసీ ఫెయిలైంది. ఓటరు కార్డుతో పోలింగ్ సెంటర్ కు వెళితే.. లిస్టులో పేరు లేదని వెనక్కి పంపేస్తరు. ఏ ఓటు హక్కు లేనోళ్లు పొయి వేరే వాళ్ల ఓటు (దొంగ ఓటు) వేసి వస్తరు.

– నర్సింహారెడ్డి,  పొలిటికల్​ ఎక్స్​పర్ట్