మరో వైరస్‌‌తో వణికిపోతున్న ఇరాక్

మరో వైరస్‌‌తో వణికిపోతున్న ఇరాక్

ప్రపంచాన్ని వైరస్ లు ఒకదాని వెంట ఒకటి వణికిస్తున్నాయి. కరోనా వైరస్ తగ్గుముఖం పట్టకముందే కొత్త వేరియంట్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో చాలా మంది ఈ వైరస్ ల కారణంగా చనిపోతున్నారు. తాజాగా.. ఇరాక్ కాంగో పీవర్ తో వణికిపోతోంది. భారీగా అక్కడ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సంవత్సరం 111 CCHF (క్రిమియన్ కాంగో హోమోరేజిక్ ఫీవర్) కేసుల్లో 19 మంది చనిపోయారని WHO వెల్లడించింది. వైరస్ కు వ్యాక్సిన్ లేదని, అంతర్గతంగా..బహిర్గతంగా ప్రధానంగా ముక్కు నుంచి తీవ్రమైన రక్తస్రావం జరుగుతుందని వైద్యులు వెల్లడిస్తున్నట్లు సమాచారం. రక్తం పీల్చే తేలు ద్వారా జంతువుల నుంచి మానవులకు ఈ కాంగో ఫీవర్ వ్యాపిస్తోంది. వైరస్ సోకిన వ్యక్తుల నుంచి రక్తం, చెమట కణాలు, ఇతరత్రా ఇతరులకు వ్యాపిస్తోందని వైద్యులు పేర్కొంటున్నారు.

వైరస్ ఉన్న పేలు  పశువుల రక్తాన్ని తాకి కుట్టినప్పుడు మానవులకు సోకుతుంది. వైరస్ మరింత విస్తరించకుండా ఉండేందుకు గ్రామీణ ప్రాంతాల్లో క్రిమిసంహారక మందులు పిచికారీ చేస్తున్నారు. ఆఫ్రికా, ఆసియా మధ్య తూర్పు ప్రాంతాల్లో కాంగో ఫీవర్ కేసులు ఎక్కువగా కనిపిస్తున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ భావిస్తోంది. 1979లో ఇరాక్ లో వెలుగు చూసిన ఈ కాంగో ఫీవర్ మళ్లీ ఇప్పుడు విజృంభిస్తోంది. కరోనా సమయంలో క్రిమి సంహారక మందులను సరిగ్గా పిచికారీ చేయకపోవడం వల్లే.. ఈ వ్యాధి వ్యాప్తికి కారణమౌతోందని WHO అంచనా వేస్తొంది. ఈ వ్యాధి సోకిన ప్రతి ఐదుగురిలో రెండో వంతు కేసుల్లో మరణాలు సంభవిస్తున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తల కోసం : -

బీజేపీ రాజ్యసభ అభ్యర్థుల జాబితా విడుదల


రాజ్యసభకు చిదంబరం.. ఆజాద్‌‌కు నో ఛాన్స్!