
తాండూరులో గుండెపోటు బాదితుడికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన హెడ్ కానిస్టేబుల్ ను పోలీస్ డిపార్ట్ మెంట్ , అధికారులు ప్రశంసించారు. కానిస్టేబుల్ ను సన్మానించిన తాండూరు డీఎస్పీ శేఖర్ గౌడ్ రివార్డ్ ను ప్రకటించారు.
తాండూరు టౌన్ తులసి నగర్ లో ఆదివారం మధ్యాహ్నం తన ఇంట్లో నగేష్ అనే వ్యక్తి గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. వెంటనే అతని భార్య కపాడండి కాపాడాడండి అంటూ కేకలు వేసింది. అయితే ఏదో చైన్ స్నాచింగ్ లేదా దొంగతనం అనుకున్న హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ వెంటనే నగేష్ ఇంటికెళ్లాడు. అక్కడే కుప్పకూలి ఉన్న నగేష్ కు హెడ్ కానిస్టేబుల్ రామకృష్ణ సీపీఆర్ చేశారు.దీంతో నగేష్ కు మెలకువ వచ్చింది. తర్వాత వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి ట్రీట్ మెంట్ అందించారు. ప్రస్తుతం బాధితుడు నగేష్ ఆరోగ్యం నిలకడగా ఉందంటూ అతని కుటుంబ సభ్యులు తెలిపారు.