
ప్రజలే తన హైకమాండ్‌గా భావించే పార్టీకి చెందిన వ్యక్తే దేశానికి ప్రధానిగా ఉండాలన్నారు ప్రధాని మోడీ.ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ కర్ణాటకలోని చిత్రదుర్గలో నిర్వహించిన ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన… కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు కేవలం అధికారం కోసమే పొత్తు పెట్టుకున్నాయని ఆరోపించారు. అధికార దాహంతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వం..కొంతమంది కూటమి నేతలు ఏమి చెబితే అదే చేస్తోందని, ఆ రిమోట్ వారందరి చేతుల్లో ఉందని ఆరోపించారు. ప్రజలే తన హైకమాండ్‌గా భావించే పార్టీకి చెందిన వ్యక్తే దేశానికి ప్రధానమంత్రిగా ఉండాలని ప్రజలకు సూచించారు. భారత్ అంటే ఏమిటో పాకిస్థాన్‌కు తెలియజేయడానికి బాలాకోట్‌లో వైమానిక దాడులు జరిపామని వివరించారు. భారత్ అంటే ఏమిటో పాకిస్థాన్‌కు తెలియజేయడానికి బాలాకోట్‌లో వైమానిక దాడులు జరిపామని తెలిపారు. ఈ విషయంలో ప్రపంచ దేశాలన్నీ భారత్‌కు అండగా నిలిస్తే… కాంగ్రెస్ సహా ఆ కూటమికి చెందిన పార్టీలు మాత్రం ఆ దాడులను ఖండించాయన్నారు ప్రధాని మోడీ.