మా పార్టీ అభ్యర్థికి ఓటు వేయొద్దు! ..బన్‌‌స్వార ప్రజలకు కాంగ్రెస్‌‌ విజ్ఞప్తి

మా పార్టీ అభ్యర్థికి ఓటు వేయొద్దు! ..బన్‌‌స్వార ప్రజలకు కాంగ్రెస్‌‌ విజ్ఞప్తి

జైపూర్ :  రాజస్థాన్‌‌లోని బన్‌‌స్వార‌‌‌‌‌‌‌‌‌‌‌‌‑ దుంగర్‌‌‌‌పూర్‌‌‌‌ లోక్‌‌సభ నియోజకవర్గం లో పోటీ చేస్తున్న తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేయొద్దని ప్రజలను కాంగ్రెస్‌‌  కోరింది. ఈ నియోజకవర్గంలో గిరి జనులు ఎక్కువగా ఉండటంతో భారత్‌‌ అదివాసీ పార్టీ (బీఏపీ) అభ్యర్థి రాజ్‌‌కు మార్‌‌‌‌ రౌత్‌‌కు మద్దతు ఇవ్వాలని కాంగ్రె స్‌‌ నిర్ణయించింది. నామినేషన్‌‌ ఉపసంహరణ గడువుకు ఒక రోజు ముందు ఈ నిర్ణయం తీసుకుంది. పార్టీ అభ్యర్థి అరవింద్‌‌ దామోర్‌‌‌‌ను నామినేషన్‌‌ విత్ డ్రా చేసుకోవాలని కోరింది. ఆయన కూడా ఓకే చెప్పారు. కానీ నామినేషన్‌‌ ఉపసంహరణ చివరి రోజు అదృశ్యమయ్యారు.

ఆ మరుసటి రోజు డైరెక్ట్‌‌గా మీడియా ముందు ప్రత్యక్షమై తాను ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లిన అరవింద్‌‌కు కాకుండా బీఏపీ అభ్యర్థి రాజ్‌‌కుమార్‌‌‌‌కు ఓటు వేయాలని నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్‌‌ నాయకులు ప్రచారం చేస్తున్నారు. కాగా, నియోజ కవర్గంలో కాంగ్రెస్‌‌ మద్దతు ఉన్న బీఏపీ, బీజేపీ మధ్య ద్విముఖ పోటీ ఉండగా, ప్రస్తుతం అరవింద్‌‌ దామోర్‌‌‌‌ కూడా పోటీ చేయడంతో అక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. అయితే, అరవింద్‌‌ పోటీలో ఉండటంతో ఓట్లు చీలుతా యని, ఇది బీజేపీ అభ్యర్థి మహేంద్రజిత్‌‌ సింగ్‌‌ మాలవీయకే ఎక్కువ లబ్ధి జరుగుతుందేమోనని కాంగ్రెస్‌‌ నేతలు ఆందోళన చెందుతున్నారు.