చీకటి ఒప్పందంతోనే దాడులు చేయట్లే..

చీకటి ఒప్పందంతోనే దాడులు చేయట్లే..

హైదరాబాదాద్: విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని బీజేపీ చూస్తోందని పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ ఫ్యామిలీపైన బీజేపీ ఎందుకు విచారణ జరిపించడంలేదని ప్రశ్నించారు. దీని వెనకాల ఉన్న బ్లాక్ మెయిల్ రాజకీయం ఏమిటో ప్రజలకు తెలియాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇటీవల పలు కంపెనీలపై ఐటీ దాడులు జరిపినప్పటికీ ఎంత అమౌంట్ దొరికింది.. దాని వెనకాల ఎవరున్నారనేదానిపై క్లారిటీ ఇవ్వలేదని సీరియస్ అయ్యారు. దుబ్బాక ఎన్నికలో డబ్బులు దొరికినా కేసీఆర్ రఘునందన్ పై చర్యలు తీసుకోలేదని.. ఇప్పుడు టీఆర్ఎస్ పై  బీజేపీ అలాగే ప్రవర్తిస్తుందన్నారు. చీకటి ఒప్పందం ప్రక్రియలో భాగంగానే ఇదంతా నడుస్తుందని రేవంత్ రెడ్డి తెలిపారు. 

ప్రతి ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటీలోనే లేదు. బీజేపీ, టీఆర్ఎస్ మధ్యనే పోటీ జరుగుతుంది. దాడులు.. ప్రతి దాడులు చేసుకొని.. గొప్ప నాటకాన్ని రక్తి కట్టించి, ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందడానికే బీజేపీ, టీఆర్ఎస్ కలిసి ఆడుతున్న నాటకం అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక కోసం ఈ నెల చివరి వారంలో అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు. పార్టీ ముఖ్య నేతలతో చర్చించిన తర్వాత.. పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి రిపోర్ట్ ఇస్తామన్నారు.  ఈ రెండు మూడు రోజుల్లోనే ఈ ప్రక్రియ జరుపుతామని రేవంత్ రెడ్డి తెలిపారు.