కవితను ఎందుకు అరెస్ట్‌ చేయలే : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

కవితను ఎందుకు అరెస్ట్‌ చేయలే : కోమటిరెడ్డి వెంకటరెడ్డి

నల్గొండ అర్బన్, వెలుగు :  గల్లీల్లో బతుకమ్మ అడుతూ ఢిల్లీలో లిక్కర్ దందాలు చేస్తున్న కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని ఎంపీ, నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు. బీఆర్‌‌ఎస్, బీజేపీ ఒక్కటేనని చెప్పేందుకు ఇదే నిదర్శనమని చెప్పారు. బుధవారం కనగల్​ మండలంలోని దర్వేశిపురం, చర్లగౌరారం, మంచినీళ్లబావి, కేబీ తండా, ఇస్లాంనగర్​, తేలకంటిగూడెం, తిమ్మన్నగూడెం, ఎస్​.లింగోటం, బాబాసాహెబ్​గూడెం, చెట్ల చెన్నారం, చిన్నమాదారం, తంగెళ్లవారిగూడెం, ఇరుగంటిపల్లి, జంగమయ్యగూడెంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  సీఎం కేసీఆర్‌‌ దత్తత పేరుతో నల్గొండ ప్రజలను మోసం చేశాడని మండిపడ్డారు.

మళ్లీ మోసపూరిత హామీలు ఇచ్చేందుకు ఈ నెల 20న నల్గొండకు వస్తున్నారని, ప్రజలెవరూ నమ్మోద్దని సూచించారు. డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇస్తామని చెప్పి సింగిల్ రూమ్‌ ఇల్లు కూడా ఇవ్వలేదని, కొత్తగా ఒక్క రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలాలు లేవని విమర్శించారు. గ్రామాలలో రోడ్లు గుంతలు పడి అధ్వానంగా మారినా కనీసం మట్టి పోసిన దిక్కేలేదని మండిపడ్డారు.  దేశంలో ఏకైక సెక్యులర్ పార్టీ కాంగ్రెస్​  అని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పార్టీలకతీతంగా అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తామని చెప్పారు.  

కేసీఆర్​పోలీస్​ వ్యాన్లలో నల్గొండకు డబ్బులు పంపుతున్నారని, బీఆర్​ఎస్​ అభ్యర్థులు ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకుని చేయి గుర్తుకు ఓటు వేయాలని కోరారు.  కోమటిరెడ్డి సతీమణి సబిత, కూతురు శ్రీనిధి   33, 34 వార్డుల్లోని న్యూ తిరుమల నగర్, మీర్బాగ్ కాలనీ, వీటి కాలనీలలో   ప్రచారం నిర్వహించారు.  నేతలు నర్సింగ్​ శ్రీనివాస్​, రాజిరెడ్డి, రమేశ్​, రాజు,  బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి,  నాంపల్లి భాగ్య నరసింహ, అబ్బగోని కవిత, గుమ్మల జానకి, కేసాని కవిత,ఎగ్గడి సుజాత, అబ్బగోని కవిత తదితరులు పాల్గొన్నారు.