ఆరు గ్యారంటీలతో పేదల జీవితాల్లో వెలుగు : పాయం వెంకటేశ్వర్లు

ఆరు గ్యారంటీలతో పేదల జీవితాల్లో వెలుగు : పాయం వెంకటేశ్వర్లు
  •     పినపాక కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు

గుండాల,  వెలుగు : కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారంటీలతో పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని పినపాక కాంగ్రెస్ అభ్యర్థి పాయం వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం మండలంలోని చెట్టుపల్లి, చెంబుని గూడెం, నల్ల చేలక, వెన్నెల బైలు, గలబ, సాయనపల్లి, దామరతోగు  గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గుండాలలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

బీఆర్ఎస్ పై వ్యతిరేకత పెరిగిందని, జనం కాంగ్రెస్ ను ఆదరిస్తున్నారని అన్నారు.  బోయేది మన కాంగ్రెస్ ప్రభుత్వం అని,  సమస్యలన్నీ పరిష్కారమైతాయన్నారు. కార్యక్రమంలో కోడెం ముత్యమాచారి, ఖదీర్,  ముత్తయ్య, ఎంపీటీసీ కిష్ణ రావు, ఈసం పాపారావు, సీపీఐ రమేష్, టీజేఏస్  రమేశ్, టీడీపీ సాంబయ్య తదితరులు
 పాల్గొన్నారు.