వెలుగు, సిటీ నెట్వర్క్: జూబ్లీహిల్స్ గడ్డపై చాలా ఏండ్ల తర్వాత కాంగ్రెస్ జెండా రెపరెపలాడంతో గ్రేటర్ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. ఉప ఎన్నికలో తమ అభ్యర్థి నవీన్ యాదవ్ సూపర్ విక్టరీ సాధించడంతో సిటీ గల్లీగల్లీలో సంబురాలు చేసుకున్నారు.
జూబ్లీహిల్స్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యథిక మెజార్టీ రావడంతో డ్యాన్స్‌లు చేస్తూ, పటాకులు పేలుస్తూ సందడి చేశారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం నవీన్ యాదవ్ యూసఫ్ గూడలో భారీ ర్యాలీ తీశారు.
బీఆర్ఎస్, బీజేపీ ఆటలు ఇంకా సాగవు
రాష్ట్రంలో కాంగ్రెస్ సంక్షేమ పాలనకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితమే నిదర్శనం. బీఆర్ఎస్ దశాబ్ద కాలం ఏమీ చేయలేదు. జూబ్లీహిల్స్‌లో తప్పుడు ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టే వారి ప్రయత్నం విఫలమైంది. బీఆర్ఎస్ రగిలించిన సెంటిమెంట్ కూడా ప్రజలను ప్రభావితం చేయలేదు. మతం పేరుతో ప్రజలను విడదీసే బీజేపీకి డిపాజిట్ కూడా రాలేదు. ఈ రెండు పార్టీల ఆటలు ఇంకా తెలంగాణలో సాగవు.
- పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ
సీఎంకిది బర్త్‌డే గిఫ్ట్
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సీఎం రేవంత్ రెడ్డికి బర్త్‌డే గిఫ్ట్. జూబ్లీహిల్స్ ప్రజలు చూపిన విశ్వాసానికి ధన్యవాదాలు. కాంగ్రెస్ నాయకత్వంపై ప్రజలకు ఉన్న అభిమానం ఈ ఫలితంతో మరింత బలపడింది.
– గ్రేటర్ డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతా శోభన్ రెడ్డి
బీఆర్ఎస్కు కర్రు కాల్చి వాత పెట్టారు
బీఆర్ఎస్కు జూబ్లీహిల్స్ ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. వారి అసత్య ప్రచారాలను ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదు. ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ యాదవ్‌కు శుభాకాంక్షలు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు డిపాజిట్లు కూడా దక్కవు.
–కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్
చరిత్రాత్మక విజయం
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించాం. బీఆర్ఎస్ఎన్ని ప్రయత్నాలు చేసిన ప్రజలు వారి మాటలను నమ్మలేదు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ విజయ దుందుభి మోగిస్తాం.
- వికారాబాద్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అర్థ సుధాకర్ రెడ్డి
బీసీ వాదమే గెలిచింది
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీసీ వాదమే విజయం సాధించింది. నవీన్ యాదవ్ విజయం బీసీ సమాజానికి దక్కిన గౌరవం. రాష్ట్రంలో బీసీ వాదం బలంగా ఉంది. ఇప్పటికైనా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా రెడ్డి జాగృతి హైకోర్టులో వేసిన పిటిషన్‌ను బేషరతుగా ఉపసంహరిం చుకోవాలి.
- తెలంగాణ ప్రజారాజ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జిలు కర రవికుమార్
