
చేవెళ్ల, వెలుగు : జన జాతర పేరుతో కాంగ్రెస్‌పార్టీ మంగళవారం చేవెళ్లలో నిర్వహించిన బహిరంగ సభ సక్సెస్అయింది. రేవంత్‌రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని క్యాడర్లో జోష్నింపారు. రాష్ట్ర ప్రజలు ఛీకొట్టినా కేసీఆర్‌కు సిగ్గు రాలేదని మండిపడ్డారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతిని ఎండగట్టారు. వికారాబాద్జడ్పీ చైర్పర్సన్పట్నం సునీతారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్ఎస్ప్రభుత్వంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నామని, తమ వెంట నడిచిన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధించారని వాపోయారు.
భరించలేకనే పార్టీ మారామన్నారు. సీఎం రేవంత్రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారన్నారు. చేవెళ్ల ఎంపీ సీటును గెలిచి రేవంత్‌రెడ్డికి గిఫ్ట్‌గా ఇవ్వాలని పిలుపునిచ్చారు. తాండూరు, పరిగి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేలు మనోహర్‌రెడ్డి, రాంమోహన్‌రెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో దొరల పాలన పోయి ప్రజాపాలన వచ్చిందన్నారు. హామీలు అమలు చేసుకుంటూ పోతుంటే ప్రతిపక్ష పార్టీలు కావాలనే రాద్దాంతం చేస్తున్నాయన్నారు. చేవెళ్ల ఇన్చార్జ్పామేన భీంభరత్మాట్లాడుతూ.. చేవెళ్ల అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించాలని సీఎంని విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్అధ్యక్షుడు చల్లా నర్సింహ్మారెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్ పర్సన్ అనితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.