- కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ
సిద్దిపేట రూరల్, వెలుగు: స్థానిక ఎన్నికలతో బీఆర్ఎస్ ఖాళీ అవడం ఖాయమని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ అన్నారు. సిద్దిపేట అర్బన్ మండలం తడ్కపల్లి గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు అంబటి మహేశ్ గౌడ్ ఆధ్వర్యంలో భారీగా బీఆర్ఎస్ కార్యకర్తలు, యువత కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
హరికృష్ణ మాట్లాడుతూ సిద్దిపేటలో హరీశ్ పతనం స్టార్ట్ అయిందని, తడ్కపల్లి గ్రామానికి పదేళ్లపాటు అధికారం లొ ఉన్న హరీశ్ రావు ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారం లొ రాగానే 110 ఇందిరమ్మ ఇండ్లతో పాటు 395 కొత్త రేషన్ కార్డులు ఇచ్చామని తెలిపారు. కార్యక్రమంలో అర్బన్ మండల అధ్యక్షుడు భిక్షపతి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు యాదగిరి, అంజన్న, డీసీసీ మహిళా అధ్యక్షురాలు లక్ష్మి, పర్శ రాములు పాల్గొన్నారు.
