ఇవాళ(అక్టోబర్30) గాంధీ భవన్​లో కులగణనపై మీటింగ్

ఇవాళ(అక్టోబర్30) గాంధీ భవన్​లో కులగణనపై మీటింగ్
  • హాజరుకానున్న పీసీసీ చీఫ్, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో త్వరలో చేపట్టనున్న కులగణనకు పార్టీ పరంగా ఎలాంటి సహకారం అందించాలన్న దానిపై పీసీసీ ఆధ్వర్యంలో బుధవారం ప్రత్యేక సమావేశం జరగనుంది. ఉదయం 10:30 గంటలకు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అధ్యక్షతన కొనసాగనున్న ఈ సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జ్​ దీపాదాస్ మున్షీ, విప్​లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, డీసీసీ అధ్యక్షులు హాజరుకానున్నారు. కులగణనపై అన్ని జిల్లాల నేతల అభిప్రాయాలను తెలుసుకొని, ఎలా ముందుకు పోవాలనే దానిపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.

నేడు మంత్రులతో ముఖాముఖి వాయిదా

గాంధీ భవన్​లో బుధవారం జరగాల్సిన మంత్రులతో ముఖాముఖీ ప్రోగ్రాం వాయిదా పడింది. ఇవ్వాళ గాంధీ భవన్​లో కులగణనపై పీసీసీ ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం జరగనుండడం, దీనికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం, మంత్రులు హాజరవుతున్నందున ముఖాముఖి ప్రోగ్రాంను వాయిదా వేసినట్టు పీసీసీ ప్రకటించింది.