యూనివర్సిటీలను డెవలప్ చెయ్యాలె : పుట్ట లక్ష్మణ్

యూనివర్సిటీలను డెవలప్ చెయ్యాలె : పుట్ట లక్ష్మణ్
  •     ఏఐఎస్ఎఫ్​రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ 

ఓయూ,వెలుగు :  కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని యూనివర్సిటీలను అభివృద్ధి చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్​చేశారు. ఏఐఎస్ఎఫ్ ఓయూ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజీ ముందు గురువారం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో  వర్సిటీలకు నిధులు కేటాయించకుండా ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయకుండా నిర్వీర్యం చేసిందని ఆరోపించారు. 

పార్టీకి చెందిన నేతలకు ప్రైవేటు వర్సిటీలకు  అనుమతులు ఇచ్చిందని విమర్శించారు. ఉస్మానియా వర్సిటీకి రూ. 1000 కోట్లు, ఇతర వర్సిటీలకు ఒక్కోదానికి రూ. 300 కోట్ల చొప్పున నిధులు కేటాయించాలని కోరారు. ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పించాలని, పీజీ పీహెచ్​డీ విద్యార్థులకు ఫెలోషిప్ లు  ఇవ్వాలని,  వర్సిటీ భూములను కాపాడాలని పేర్కొన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శి గ్యారా నరేశ్, ఓయూ కార్యదర్శి నెల్లి సత్య, లెనిన్​,ఉదయ్ పాల్గొన్నారు.