బడుగుల వైపే కాంగ్రెస్ ప్రభుత్వం .. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

బడుగుల వైపే కాంగ్రెస్ ప్రభుత్వం .. రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి

బషీర్​బాగ్​,వెలుగు: అనాదిగా అనగదొక్కబడిన వర్గాలకు ఆర్థికంగా, రాజకీయంగా చేయూతనందిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు.  హైదరాబాద్ రవీంద్రభారతిలో తెలంగాణ సగర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ ఆధ్వర్యంలో సగర ఉత్తమ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హాజరై మాట్లాడారు. 

సగరలను బీసీ‘డి’ నుంచి బీసీ ‘ఎ’లోకి మార్చే విషయంపై సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. కోకాపేటలో సగర భవనాన్ని నిర్మించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, సగర సంఘం నాయకులు ముత్యాల హరికిషన్, సత్యం, మారుతి, కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌‌ క్లియర్‌‌ చేసిన మంత్రి..

గండిపేట: మెహిదీపట్నం నుంచి శంషాబాద్‌‌ వైపు వెళ్తున్న కారు పీవీ నర్సింహ్మరావు ఎక్స్‌‌ప్రెస్‌‌ వేపై డివైడర్‌‌ను ఢీకొట్టింది. దీంతో ట్రాఫిక్‌‌ జామ్‌‌ ఏర్పడగా అటుగా వెళ్తున్న మంత్రి వాకిటి శ్రీహరి కార్వాయ్‌‌ను ఆపి దిగారు. స్వయంగా ట్రాఫిక్‌‌ ను క్లియర్​ చేశారు.