నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ (NI–MSME) అసోసియేట్ ఫ్యాకల్టీ మెంబర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్లు సమర్పించడానికి చివరి తేదీ డిసెంబర్ 09.
పోస్టుల సంఖ్య: 03.
పోస్టులు: అసోసియేట్ ఫ్యాకల్టీ మెంబర్ (టెక్నాలజీ) 02, అసోసియేట్ ఫ్యాకల్టీ మెంబర్ (ట్రేడ్ అండ్ మార్కెటింగ్) 01.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎం.టెక్/ ఎంఈలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 40 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
లాస్ట్ డేట్: డిసెంబర్ 09.
అప్లికేషన్ ఫీజు: ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు. ఇతరులకు రూ.1000. ఎన్ఈఎఫ్టీ/ ఆర్టీజీఎస్ ద్వారా చెల్లించాలి.
సెలెక్షన్ ప్రాసెస్: షార్ట్‌లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు nimsme.gov.in వెబ్సైట్లో సంప్రదించగలరు.
