నువ్వులు.. ప్రతి ఇంట్లో సాధారణంగా ఉంటాయి. ఇవి నల్లగా.. తెల్లగా ఉంటాయి. చూడటానికి చిన్న గిం.లే అయినా వాటి వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి. ఆరోగ్యమే కాదు.. అందం కూడా ఇస్తాయి. నువ్వుల్లో ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఐరన్, జింక్, కాల్షియం, థయామిన్, ఇతర మినరల్స్ ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇవి కేవలం ఆరోగ్యానికే కాదు... అందానికి కూడా ఉపయోగపడుతాయి. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..
నువ్వులు అందంతోపాలు ఆరోగ్యా న్నిస్తాయి. నువ్వుల నూనె వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి
- నువ్వులు వేడి గుణాన్ని, ఉష్ణశక్తి ని కలిగి ఉంటాయి. అందువల్ల చలికాలం వర్షకాలంలో వీటిని ఎక్కువగా ఉపయోగించాలి.
- గాయాలు తగిలినచోట నువ్వుం నూనె రాస్తే ఉపశమనం కలుగు నుంది.
- నువ్వులు పైల్స్, అతిసార, రుతుసంబంధ సమస్యలను తగ్గిస్తాయి.
- కొవ్వును తగ్గిస్తాయి.
- తిన్న ఆహారం జీర్ణమవ్వడానికి ఉప యోగపడతాయి.
- నువ్వుల నూనెతో ప్రతిరోజు శరీరానికి మర్దన చేయాలి. దీని వల్ల చర్మా నికి నిగారింపు వస్తుంది. వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది.
- చిన్న పిల్లలకు ఈ నూనెతో మర్దన చేయడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి.
- నువ్వుల నూనెతో తలకు మర్దన చేయడం వల్ల చుండ్రు బాధ తప్పుతుంది.
- నువ్వు పువ్వులు మొత్తగా చేసి అందులో నెయ్యి, తేనె కలిపి తలకు పట్టించాలి. ఇది జుట్టుకు మంచి కండీషనర్ గా పనిచేస్తుంది..
- నువ్వుల్లో రెండు రకాలు ఉంటాయి. తెల్ల నువ్వుల్లో కార్భొహైడ్రేడ్లు, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. నల్లనువ్వుల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉండి కార్భొహైడ్రేడ్లు తక్కువుగా ఉంటాయి.
వెలుగు,లైఫ్
