డ్రగ్స్‌ వెనుక ఎంత పెద్దవాళ్లున్నా జైలుకు వెళ్లాల్సిందే: రేవంత్‌రెడ్డి

డ్రగ్స్‌ వెనుక ఎంత పెద్దవాళ్లున్నా జైలుకు వెళ్లాల్సిందే: రేవంత్‌రెడ్డి

బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం డ్రగ్స్, గంజాయికి అడ్డాగా మారిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు.  డ్రగ్స్ కోరల్లో పంజాబ్ మాదిరిగా రాష్ట్రాన్ని తయారుచేశారన్నారు.  ఇకపై డ్రగ్స్ పై ఊపేక్షించేది లేదన్నారు.  గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్బంగా సీఎం ఈ కామెంట్స్ చేశారు. 

 రాష్ట్ర సరిహద్దు్ల్లో  డ్రగ్స్,   గంజాయి వస్తే సహించేది లేదన్నారు.  డ్రగ్స్‌ విషయంలో ఇకపై ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు.  డ్రగ్స్‌ వెనుక ఎంత పెద్దవాళ్లున్నా జైలుకు వెళ్లాల్సిందేనని తెలిపారు.  రాష్ట్రానికి గంజాయి తీసుకురావలంటే  భయపడాలన్నారు. ఎవరైనా డ్రగ్స్ తీసుకోవాలంటే వణకాలని చెప్పారు.  డ్రగ్స్‌ను అరికట్టేందుకు ఈ ప్రభుత్వం పటిష్ఠ ప్రణాళికతో వెళ్తోందని చెప్పారు.  

మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు డిసెంబర్ 20వ తేదీకి వాయిదా పడ్డాయి.  గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శాసనసభలో చర్చ ముగిసింది. దీంతో  గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానాన్ని రాష్ట్ర శాసనసభ ఆమెదం తెలిపింది. అనంతరం  అసెంబ్లీ సమావేశాలను తిరిగి బుధవారం పున: ప్రారంబించనున్నట్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. 

 డిసెంబర్ 16వ తేదీ శనివారం రాష్ట్ర అసెంబ్లీలో అధికారపక్షం, ప్రతిపక్షం మధ్య మాటల యుద్ధం జరిగింది. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో జరిగిన తప్పులను ఎత్తిచూపిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ప్రతిపక్షం కూడా అధికార పక్షానికి ధీటుగా సమాదానమిచ్చింది.