కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ కల్పనకు సర్కారు ప్రాధాన్యం : పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగ కల్పనకు సర్కారు ప్రాధాన్యం :  పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ

కోల్​బెల్ట్​,వెలుగు: కాంగ్రెస్​ ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేపట్టి నిరుద్యోగం నుంచి యువతను కాపాడుతుందని   పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు.ఆదివారం మంచిర్యాల జిల్లా మంచిర్యాల,బెల్లంపల్లి పట్టణాల్లో ఎంపీ పర్యటించారు. జిల్లా కేంద్రం మోడల్​స్కూల్, లైబ్రరీని సందర్శించారు. డిగ్రీ కాలేజ్​ మైదానంలో మార్నింగ్​వాక్​లో పాల్గొన్న ఎంపీ   వాకర్స్​,క్రీడాకారులు,రిటైర్డు ఉద్యోగులతో మాట్లాడారు. ​

మోడల్​ స్కూల్​ విద్యార్థులు,పోటీ పరీక్షలకు ప్రిపేర్​ అవుతున్న  వారితో మాట్లాడారు.   విద్యార్థులతో కలిసి టిఫిన్​ చేశారు.  లైబ్రరీలో వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు లేకపోవడం,డ్రింకింగ్ వాటర్,ఇంటర్ నెట్,  పార్కింగ్,విద్యుత్ సమస్యలు,లైబ్రరీ నిర్వహణపై ఆఫీసర్ల నిర్లక్ష్యం ఉందంటూ నిరుద్యోగులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు.

సమస్యల పరిష్కారంలో జాప్యం చేస్తున్న లైబర్రీ ఇన్​ఛార్జీ,ఆఫీసర్లపై ఎంపీ ఆగ్రహం వ్యక్తంచేశారు.  అవసరమైన నిధులు కేటాయిస్తూ చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ కుమార్​దీపక్​ను ఆదేశించారు.  అభివృద్ధి కోసం అవసరమైన చోట్ల  ఎంపీ  నిధులు కేటాయిస్తున్నట్లు  తెలిపారు.  

అనంతరం  బెల్లంపల్లి పట్టణంలో కాంగ్రెస్ లీడర్​,అఖిల భారత యాదవ మహాసభ మంచిర్యాల జిల్లా ప్రెసిడెంట్​ బండి సదానందంయాదవ్​,ఓబీసీ సెల్​ స్టేట్​ వైస్​ చైర్మన్​ ప్రభాకర్​ తల్లి బండి లింగమ్మ చనిపోగా ఆమె భౌతిక కాయాన్ని ఎంపీ వంశీకృష్ణ,డీసీసీ ప్రెసిడెంట్​ రఘునాథ్​రెడ్డి,కాంగ్రెస్​ లీడర్లు సందర్శించి నివాళ్లుర్పించారు.