కాంగ్రెస్ లో 40 మంది బీసీలు గెలిచే చాన్స్ ఉంది : మహేశ్​కుమార్​ గౌడ్​

కాంగ్రెస్ లో  40 మంది బీసీలు గెలిచే చాన్స్ ఉంది : మహేశ్​కుమార్​ గౌడ్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్​అనుకూల పవనాలు వీస్తున్నాయని పీసీసీ వర్కింగ్​ ప్రెసిడెంట్ మహేశ్​ కుమార్​గౌడ్​అన్నారు. కాంగ్రెస్​ అధికారంలోకి  వస్తేనే రాష్ట్రం బాగుపడుతుందని వెల్లడించారు. శనివారం ఆయన గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 40 మంది వరకు బీసీ అభ్యర్థులు గెలిచే అవకాశం ఉందని, వారికి టికెట్లు ఇవ్వాలని కోరుతున్నామని మహేశ్ గౌడ్ చెప్పారు. రాహుల్​ గాంధీ కూడా బీసీలకు మద్దతుగా ఉంటున్నారని తెలిపారు. స్క్రీనింగ్​ కమిటీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గేతో  కమ్యూనికేషన్​ గ్యాప్​వల్ల ఇబ్బంది పడ్డామని వెల్లడించారు. అపాయింట్​మెంట్​ లేకుండానే ఢిల్లీకి వెళ్లామని మహేశ్ గౌడ్ పేర్కొన్నారు.