అసెంబ్లీలో కాంగ్రెస్ బొక్కబోర్లా పడింది : జగదీశ్‌‌‌‌ రెడ్డి

అసెంబ్లీలో కాంగ్రెస్ బొక్కబోర్లా పడింది : జగదీశ్‌‌‌‌ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రాలతో కొండను తవ్వి ఎలుకను కూడా పట్టలేక.. బొక్కబోర్లా పడిందని బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌ ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌‌‌‌‌‌‌‌ రెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వంలో విద్యుత్ పరిస్థితి బాగా మెరుగుపడిందన్న విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. అసెంబ్లీలో మంత్రుల మధ్య సమన్వయం లేదని, తాము అడిగే ప్రశ్నలకు తెల్ల మొహాలు వేశారన్నారు. తాము వాస్తవాలు చెబితే వాళ్లు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ‘‘శ్వేత పత్రంలో ఉన్న దానిపైనే మేము మాట్లాడాం. కేసీఆర్ ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు రూ.50 వేల కోట్ల మేర చేయూత అందించింది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎక్కడా వ్యవసాయానికి 6 గంటల కరెంటు ఇవ్వలేక పోతున్నాయి. ”అని ఆయన విమర్శించారు. 

విద్యుత్‌‌‌‌ వ్యవస్థను బలోపేతం చేసినం..

విద్యుత్ సంస్థలకు దేశవ్యాప్తంగా అప్పులున్నాయని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చూపించడానికి ప్రయత్నించి విఫలమైందని జగదీశ్‌‌‌‌ రెడ్డి అన్నారు. విద్యుత్‌‌‌‌ పంపిణీ వ్యవస్థను రూ.40 వేల కోట్లతో బలోపేతం చేసిన ఘనత కేసీఆర్‌‌‌‌‌‌‌‌ దేనన్నారు. జెన్ కో ప్రాజెక్టులను ప్రభుత్వ సంస్థలకే అప్పగించామని, ప్రైవేట్ వాళ్లికిచ్చి దోచుకోలేదన్నారు. నార్త్ సౌత్ గ్రిడ్ పూర్తిలో కేసీఆర్ కృషి ఎంతో ఉందని చెప్పారు. కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఈ గ్రిడ్‌‌‌‌కు సహకరించలేదన్నారు. వ్యవసాయ బోర్లకు మోటార్లు బిగించొద్దనే తమ డిమాండ్‌‌‌‌పై ప్రభుత్వం ఇంకా స్పందించలేదని పేర్కొన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌‌‌‌ను ఎప్పుడు ప్రారంభిస్తారో ప్రభుత్వం చెప్పలేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం తమ డిమాం డ్లపై సమాధానం చెప్పలేక పారిపోయిందని ఎద్దేవా చేశారు. శ్వేత పత్రాల్లో తప్పుడు గణాంకాలు ఉన్నాయని ఆరోపించారు. అప్పుల విషయంలో రూ.4 వేల కోట్లకు పైగా తేడా కనిపించాయని తెలిపారు.

24 గంటల సరఫరాకు కట్టుబడి ఉన్నరా?

రైతులతో పాటు అన్ని రంగాల వినియోగదారులకు 24 గంటల కరెంట్ ఇచ్చేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉన్నదా? అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. కరెంట్ బిల్లుల భారం ప్రజలపై వేయొద్దన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్లందరికీ 200 యూనిట్ల దాకా ఫ్రీ కరెంట్ ఎప్పట్నుంచి ఇస్తారని నిలదీశారు. ‘‘ విద్యుత్ బిల్లుల భారం ప్రజలపై వేయొద్దు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయానికి ఆరు గంటల కరెంటే ఇచ్చారు.” అని విమర్శించారు. కాలువల మీద మోటార్లు పెట్టడంతో పంపు సెట్ల సంఖ్య పెరిగిందని తెలిపారు. చెక్​డ్యామ్​ల వద్ద మోటార్లు పెట్టుకున్నారని వివరించారు. భద్రాద్రి, యాదాద్రికి సంబంధించి ఒక్క రూపాయి కూడా నష్టం జరగలేదన్నారు. విచారణలో కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు.  రాష్ట్రంలో విద్యుత్‌‌‌‌ రంగాన్ని బలోపేతం చేసేందుకు అప్పులు తెచ్చామని.. తెచ్చిన అప్పులను సగానికిపైగా తీర్చేశామని జగదీశ్‌‌‌‌ రెడ్డి తెలిపారు. 2014, జూన్‌‌‌‌ 2 నాటికి విద్యుత్‌‌‌‌ సంస్థల ఆస్తులు రూ.44,438 కోట్లు ఉంటే.. అప్పు రూ.22,423 కోట్లు ఉండేదని తెలిపారు. ఇప్పుడు అప్పులు రూ.81,016 కోట్లు ఉండగా.. ఆస్తుల విలువ రూ.1,37,570 కోట్లకు పెంచామని వివరించారు. తెచ్చిన అప్పుతో ఎక్కడా నష్టం జరగలేదని తెలిపారు.

గృహజ్యోతి ఎట్ల అమలు చేస్తరు?: అక్బరుద్దీన్

గృహజ్యోతి ఎలా అమలు చేస్తారని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. భారం ఎంత పడుతుంది? డిస్కంల భారాన్ని ఎలా తగ్గిస్తారనే దానిపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఆర్థిక పరిస్థితి, విద్యుత్​పై శ్వేతపత్రంలో లెక్కలు వేర్వే రుగా ఉన్నాయన్నారు. తర్వాత మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడారు. లెక్కల్లో పొరపాట్లు లేవన్నారు. నెలలు, తేదీలు మార్పు ఉండటంతో అప్పటి వరకు ఎంత ఉందో అంత చెప్పామన్నారు.