కాంగ్రెస్ కోమాలో ఉంది : భగవంత్ సింగ్ మాన్

కాంగ్రెస్ కోమాలో ఉంది : భగవంత్ సింగ్ మాన్

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయానికి ఆమ్ ఆద్మీ పార్టీయే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై ఆప్ నేత, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ తీవ్రంగా స్పందించారు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కోమాలో ఉందన్నారు. " సూర్యుడు ఎక్కడ (గుజరాత్) అస్తమించాడో అక్కడ ఎన్నికలు జరిగాయి, రాహుల్ గాంధీ తన పాదయాత్రను సూర్యుడు మొదట ఉదయించే ప్రదేశం (కన్యాకుమారి) నుండి ప్రారంభించారు. ముందు తన టైమింగ్‌ను సరిచేసుకోనివ్వండి” అని మాన్ అన్నారు. 

ప్రస్తుతం కాంగ్రెస్ పరిస్థితి చాలా దారుణంగా మారిందని,  ప్రత్యర్థి పార్టీలకు సంఖ్యా బలం లేనప్పుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వారి ఎమ్మెల్యేలను అమ్మేస్తుందంటూ మాన్ ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లలో కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా.. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీయే అధికారంలో ఉందని మాన్ అన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 182 స్థానాలకు గాను 156 స్థానాల్లో బీజేపీ గెలిచి చరిత్ర సృష్టించింది. కాంగ్రెస్ కేవలం 17 స్థానాల్లో మాత్రం గెలుపొందింది. ఇక ఆప్ 5 సీట్లను మాత్రమే గెలుచుకుంది