టి.అంజయ్య లాంటి సొంత సీఎంలను కాంగ్రెస్ అవమానించింది

టి.అంజయ్య లాంటి సొంత సీఎంలను కాంగ్రెస్ అవమానించింది

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ.. కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. ఆ పార్టీ వారసత్వ రాజకీయాలు దేశానికి ప్రమాదకరమన్నారు. కుటుంబ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పన్నారు. మహాత్మా గాంధీ కోరుకున్నట్లు కాంగ్రెస్ ఆగిపోయి ఉంటే,  దేశంలో వారసత్వ రాజకీయాల ఉండేవి కావన్నారుమనది సమాఖ్య దేశమని, వేర్వేరు రాష్ట్రాలుగా ఉన్నా.. దేశమంతా ఒక్కటేనన్న ఐక్య భావన ఉండాలని మోడీ అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ సమాఖ్య స్ఫూర్తిని పట్టించుకోలేదని, చిన్న చిన్న విషయాలకే సొంత పార్టీ సీఎంలనే అవమానించిందని అన్నారు. ఎయిర్ పోర్టులో ప్రధాని కుమారుడు రాజీవ్ గాంధీని స్వాగతించిన తీరు నచ్చక.. నాటి  ఉమ్మడి ఏపీ సీఎం టి.అంజయ్యను కాంగ్రెస్ అవమానించి, ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించిందని అన్నారు. ఆ ఘటనతో ఆంధ్రప్రదేశ్ లో కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు. అలాగే కర్ణాటకలోనూ విరేంద్ర పాటిల్ నూ చిన్న విషయంలో అవమానించిందని చెప్పారు. దేశం అభివృద్ధి చెందాలంటే.. రాష్ట్రాల ఆకాంక్షలను గుర్తించి, వాటిని అభివృద్ధి చేయాలన్నారు. కాంగ్రెస్ లేకుంటే దేశంలో ఎమర్జెన్సీ వచ్చేది కాదని.. సిక్కుల ఊచకోత కూడా జరిగేది కాదన్నారు. అధికారంలోకి ఉన్నప్పుడు కాంగ్రెస్ అభివృద్ధి  చేయలేదని.. ఇప్పుడు అపోజిషన్ లో ఉండి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. 


రాష్ట్ర విభజనపైనా ప్రధాని నరేంద్రమోడీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. మైకులు బంద్ చేసి.. చర్చ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం.. ఏపీని విభజించిందని మండిపడ్డారు. వాజ్ పేయ్ ప్రధానిగా ఉన్నప్పుడు బీజేపీ శాంతిపూర్వకంగా మూడు రాష్ట్రాలను ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రాల ఏర్పాటుకు, తెలంగాణకు తాము వ్యతిరేకంగా కాదని, కాంగ్రెస్ తీరు వల్లే ఇప్పటికీ ఏపీ, తెలంగాణ మధ్య సమస్యలు ఉన్నాయని మోడీ అన్నారు.

మరిన్ని వార్తల కోసం..

థర్డ్ వేవ్ ముగిసింది.. ఇక కరోనా ఆంక్షలు లేవు

చిన్న దొర నియోజకవర్గంలో రైతు ఆత్మహత్య

విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం అన్యాయం