పంజాబ్ కాంగ్రెస్ ఎంపీలతో సోనియా భేటీ

పంజాబ్ కాంగ్రెస్ ఎంపీలతో సోనియా భేటీ

న్యూఢిల్లీ: కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ పంజాబ్కు చెందిన పార్టీ ఎంపీలతో భేటీ అయ్యారు. ఢిల్లీలోని పార్టీ హెడ్ క్వార్టర్స్లో జరిగిన సమావేశంలో ఆ రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీలంతా పాల్గొన్నారు. నవ్ జ్యోత్ సింగ్ సిద్ధూ రాజీనామా నేపథ్యంలో తదుపరి పీసీసీ చీఫ్గా ఎవరిని నియమించాలన్న అంశంపై ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. సిద్ధూపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనట్లు తెలుస్తోంది. ఆయన వల్లే పార్టీ ఓటమిపాలైందన్న అభిప్రాయాలు వ్యక్తమైనట్లు సమాచారం.ఈ క్రమంలో అందరికీ ఆమోదయోగ్యమైన నేతకు పీసీసీ పగ్గాలు అప్పజెప్పాలని పార్టీ హైకమాండ్ భావిస్తోంది.

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాభవం మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో యూపీ, ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు పదవులకు రాజీనామా చేయాలని సోనియాగాంధీ ఆదేశించారు. ఐదు రాష్ట్రాలకు కొత్త పార్టీ చీఫ్ నియమించడంలో భాగంగా సోనియా గాంధీ ఆయా రాష్ట్రాల నేతలతో సమావేశమవుతున్నారు. వారి అభిప్రాయాలు సేకరించి రాష్ట్రాల పార్టీ అధ్యక్షుల్ని ఎంపిక చేయనున్నారు.

For more news..

సీఎల్పీలో సోనియా నాయకత్వాన్ని బలపరిచాం

భగవంత్ మాన్కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు