భగవంత్ మాన్కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు 

భగవంత్ మాన్కు ప్రధాని మోడీ శుభాకాంక్షలు 

పంజాబ్ ముఖ్యమంత్రిగా ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా మాన్ కు అభినందనలు తెలిపిన మోడీ.. పంజాబ్ అభివృద్ధి,  రాష్ట్ర ప్రజల జా సంక్షేమం కోసం కలిసి పనిచేద్దామని చెప్పారు. 


పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. 117 స్థానాలున్న అసెంబ్లీలో ఏకంగా 92 సీట్లలో విజ‌య‌కేతనం ఎగుర‌వేసింది. ఆప్ సీఎం అభ్యర్థిగా బ‌రిలోకి దిగి విజ‌యం సాధించిన భ‌గ‌వంత్ మాన్ సింగ్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. భగత్ సింగ్ స్వగ్రామమైన ఖట్కర్ కలాన్లో ప్రమాణస్వీకారోత్సవం జరిగింది.

మరిన్ని వార్తల కోసం..

కొడుకును సీఎం చేసి ఢిల్లీ పోవాలని కేసీఆర్ ప్లాన్

గోవా, మణిపూర్లో సిట్టింగ్ సీఎంలకు సెకండ్ ఛాన్స్..!